ETV Bharat / entertainment

జస్ట్​ మిస్​ - కారు ప్రమాదంలో అజిత్ సేఫ్​! - నెలలో ఇది రెండోసారి - HERO AJITH CAR ACCIDENT

అజిత్ కారుకు ప్రమాదం - నెలలో ఇది రెండోసారి - ఆందోళనలో ఫ్యాన్స్

Ajith Car Accident
Ajith (IANS PHOTO)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2025, 11:08 AM IST

Ajith Car Accident : కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌కు తాజాగా పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న రేసింగ్‌లో రీసెంట్​గా ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆయన రేసింగ్‌ టీమ్‌ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసింది.

ఇదీ జరిగింది :
తన దారిలో వస్తున్న ఓ కారును తప్పించేందుకు ప్రయత్నించిన ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రాక్‌పై అజిత్‌ కారు పల్టీలు కొట్టింది. అయితే ఘటన జరిగిన వెంటనే ఆయన సురక్షితంగా వాహనం నుంచి బయటకు వచ్చారు. అక్కడి సిబ్బంది కూడా అప్రమత్తమై అజిత్​కు సహాయం చేసింది.

ఇదిలా ఉండగా, ఇక్కడ అజిత్ తప్పు ఏమీ లేదని, మిగతా కార్ల వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ఘటన జరిగిన కొంతసేపటి తర్వాత ఆయన బయటకు వచ్చి అక్కడ ఉన్న అభిమానులతో ఫొటోలు దిగారు. రేస్‌ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు, ఈ వీడియో చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన క్షేమం కోరుతూ అప్రమత్తంగా ఉండమని అజిత్​కు నెట్టింట సూచిస్తున్నారు.

ఇదేం ఫస్ట్​టైమ్ కాదు
అయితే గడిచిన రెండు నెలల కాలంలోనే అజిత్‌కు జరిగిన రెండో ప్రమాదం ఇది. దుబాయ్‌ వేదికగా జనవరిలో జరిగిన గ్రాండ్‌ ప్రీ రేస్‌ ప్రాక్టీస్​ సెషన్​లోనూ ఆయన కారు ప్రమాదానికి గురైంది. ప్రాక్టీస్​ చేస్తున్న సమయంలో దగ్గరలోని గోడను బలంగా ఢీకొంది. అయితే ఆ ఘటనలో కారు ముందు భాగం డ్యామేజ్‌ కాగా, అప్పుడు కూడా అజిత్‌ సేఫ్​గానే బయటపడ్డారు. ఇక ఆ రేసింగ్‌ ఈవెంట్‌లో అజిత్​ టీమ్‌ విజయం సాధించింది.

సినిమాల విషయానికి వస్తే,
అజిత్‌ ప్రస్తుతం 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్‌ 'మార్క్‌ ఆంటోనీ'తో మంచి హిట్‌ అందుకున్న అధిక్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రాఫర్​గా పనిచేస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

అజిత్‌ దుబాయ్‌ కార్​ రేసింగ్‌ వీడియో రిలీజ్​- సూపర్ థ్రిల్లింగ్​గా విన్నింగ్ మూమెంట్స్​!

క్రేజీ డైరెక్టర్​తో అజిత్ నెక్ట్స్ మూవీ- 'AK64' వర్కింగ్ టైటిల్​తో షూటింగ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.