RC 16 Update : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'RC 16' (వర్కింగ్ టైటిల్). యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు పీరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్టేట్ బయటకొచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్ లో క్రికెట్‌కు సంబంధించిన అనేక కీలక సన్నివేశాలు చిత్రీకరించారని తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ మార్చి మొదటి వారంలో దిల్లీలో జరగనున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్లో రెజ్లింగ్‌కు సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆలాగే ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ న్యూస్‌తో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. చరణ్ సినిమా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలవుతుందని సంబరపడుతున్నారు.
పక్కా బ్లాక్ బస్టర్!
రీసెంట్గా ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రామ్‌చరణ్‌తో తాను తెరకెక్కిస్తున్న సినిమా గురించి దర్శకుడు బచ్చిబాబు కీలక కామెంట్లు చేశారు. ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 'ఉప్పెన సినిమాకు మా నాన్న థియేటర్ బయట నిలబడి రివ్యూలు అడిగారు. అయితే ఈ సినిమాకు అలా రివ్యూలు అడగాల్సిన పని లేదు. అది పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని అన్నారు. దీంతో అభిమానుల్లో RC16పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Feeling immensely grateful and blessed as #RC16 journey begins 🙏🏽 pic.twitter.com/HZSZVDbOyR
— BuchiBabuSana (@BuchiBabuSana) March 22, 2024
సినిమా విషయానికొస్తే
దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్ ఫుల్‌గా ఉండనుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెకు ఇది తెలుగులో రెండో సినిమా. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
'ఆ సినిమాకు థియేటర్ బయట మా నాన్న రివ్యూలు అడిగారు- RC16కు ఆ అవసరం లేదు'
RC 16 బ్యాక్‌డ్రాప్ తెలిసిపోయిందోచ్చ్! - సినిమాటోగ్రాఫర్ అలా హింట్ ఇచ్చేశారుగా!