Fraud in Horoscope in Mahabubnagar : మన కష్టాన్ని ఆసరాగా తీసుకొని, మన సమస్యలు వారి సౌకర్యంగా మార్చుకొని డబ్బులు దండుకోవడంలో కొందరు నకిలీ జ్యోతిష్యులు సిద్ధహస్తులు. మీ సమస్యలు తొలగాలంటే పూజలు చేయాలని అందినకాడికి దోచుకుంటున్నారు. అంతేకాకుండా లేనిపోని అనుమానాలు రేపి భయపడేలా చేస్తారు. ఆ తర్వాత నివారణ యంత్రాల పేరుతో నిలువు దోపిడీ చేస్తారు. తాజాగా మీ కుటుంబ సభ్యుల బాగోగులు చెప్తామని జాతకం చూసి పూజలు చేస్తామని మాయమాటలు పలికి ఓ మహిళ దగ్గరి నుంచి బంగారు నగలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
బాధితురాలు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం : ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళకు జఫర్గడ్ మండలం తీగారం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. వీరి దాపత్య జీవితానికి గుర్తుగా కుమార్తె, కుమారుడు. మానసికస్థితి సరిగా లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. శనివారం ఉదయం జాతకం చూస్తామని మీ ఇంటి పరిస్థితి బాగాలేదని, చక్కదిద్దేందుకు పూజలు చేస్తామని నమ్మబలికి ఇద్దరు స్వాములు ఇంట్లోకి వచ్చారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు సెల్ఫోన్లో వారి పొటోలను వారికి తెలియకుండా తీశాడు.
మహిళతో మాట్లాడి స్వాములు బయటకు : ఆమెతో మాట్లాడి స్వాములు బయటకు వెళ్లారు. గంట తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మళ్లీ వచ్చి పూజలు చేయాలంటూ బొట్టుపెడుతూ శోభ ముఖంపై మత్తు పదార్థాలు చల్లారు. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఇదే అదనుగా భావించిన స్వాములు సుమారు రూ.40 వేల విలువైన బంగారు చెవి కమ్మలు, మాటీలు, చేతిలో ఉన్న రూ.1000 నగదును దొంగలించారు.
నగలు కనిపించకపోవడంతో కేకలు : ఆమె లేచి చూసేసరికి నగలు కనిపించకపోవడంతో కేకలు వేసింది. పిల్లలు పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి విషయం చెప్పగానే ఉదయం ఇంటికొచ్చిన స్వాముల పోటోను చరవాణిలో తీసినట్లు కుమారుడు తెలిపారు. ఈ పోటో ఆధారంగానే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు, కుటుంబ సభ్యులు చెప్పారు. ఎస్సై క్రాంతి కిరణ్‌ను వివరణ కోరగా విషయం మా దృష్టికి వచ్చిందని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామని తెలిపారు.
మీరు కొనబోయే ఆస్తి జాతకం మొత్తం చెప్పేస్తారు! - ఈ సంస్థల గురించి తెలుసా?
నుదుట సింధూరం పెట్టి పెళ్లి అయిందన్నాడు - అవసరం తీరాక రూ.20 లక్షలు ఇస్తా అంటున్నాడు