How to Eat Pulses for Protein: మనం ఆరోగ్యం కోసం వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రతి రోజూ తింటుంటాం. కానీ, ఆయా ఆహార పదార్థాల్ని తీసుకునే క్రమంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటిస్తేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా మంది తినే పప్పుల విషయంలో కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పుల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, వీటితో పాటు పోషకాల పనితీరుకు ఆటంకం కలిగించే యాంటీ న్యూట్రియంట్లు కూడా ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఇవి పోషకాల్ని శరీరం గ్రహించకుండా అడ్డుపడతాయని.. తద్వారా అజీర్తి, కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ సమస్యలు రాకూడదంటే పప్పుల్ని ఆహారంగా తీసుకునే క్రమంలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొలకెత్తాకే!
చాలామందికి పప్పుల్ని నేరుగా వండుకోవడం లేదంటే వివిధ వంటకాల్లో భాగం చేసుకుంటుంటారు. కానీ ముందు వీటిని నానబెట్టి, మొలకలొచ్చాక వండుకునే వారు చాలా తక్కువమంది ఉంటారు. ఇలా చేయడం వల్ల యాంటీ న్యూట్రియంట్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను ప్రేరేపించచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పప్పుల్లో ఉండే పోషకాల్ని శరీరం గ్రహించకుండా ఈ యాంటీ న్యూట్రియంట్లు అడ్డుపడతాయని వివరిస్తున్నారు. అదే నానబెట్టి, మొలకలెత్తించిన పప్పుల్లో వీటి శాతం తగ్గిపోతుందని అంటున్నారు. తద్వారా సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్ వంటివి శరీరానికి అందుతాయని తెలిపారు. ఫలితంగా జీర్ణశక్తి మెరుగుపడి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వెల్లడిస్తున్నారు. 2018లో Journal of Food Scienceలో ప్రచురితమైన "Effect of Soaking and Cooking on Nutrient Retention in Pulses" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది.
వాటితో కలపండి!
పప్పుల్ని బియ్యంతో కంటే చిరుధాన్యాలు, కాయధాన్యాలతో కలిపి తీసుకోవడం వల్ల వాటిలోని సుగుణాలను శరీరం గ్రహించే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయని.. శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తై రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా.. చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోకుండానూ జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.
ఇలా తీసుకోవచ్చు!
సాధారణంగా ఎక్కువ మంది కంది, పెసర, శనగ వంటి పప్పుల్నే రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారు. కానీ మన దేశంలో ఎన్నో రకాల పప్పులు, కాయధాన్యాలు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారానికి కనీసం ఐదు రకాల పప్పులైనా ఆహారంలో భాగం చేసుకుంటే అటు వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయని అంటున్నారు. ఈ క్రమంలోనే వీటితో పచ్చళ్లు, ఇడ్లీ, దోసె, లడ్డూలు, హల్వా, పాపడ్ వంటి విభిన్న వంటకాల్ని తయారుచేసుకొని తినచ్చని సూచిస్తున్నారు. తద్వారా పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బ్రేవ్ మంటూ తేన్పులు ఇబ్బందిపెడుతున్నాయా? అసలివి ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా?
పింక్ సాల్ట్ ఎందుకు మంచిది? గులాబీ రంగు ఉప్పులో 80 రకాల మినరల్స్! ఎన్నో హెల్త్ బెనిఫిట్స్!!