Maxwell Big Bash 2025 : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న మ్యాక్సీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. ఆదివారం హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 32 బంతుల్లోనే 76 పరుగులతో సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండడం గమనార్హం.
ఇక ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 194.12 స్ట్రైక్ రేట్‌తో 297 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 17 ఫోర్లు, 20 సిక్స్‌లు బాదడం విశేషం. దీంతో టోర్నీలో అత్యధిక పరుగులు బాదిన జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్‌తో మ్యాక్స్‌వెల్ తన జట్టును క్వాలిఫైయర్‌కు తీసుకెళ్లాడు. కొంత కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న మ్యాక్స్‌వెల్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కమ్‌బ్యాక్ ఇవ్వడం ఆసీస్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతుంది.
The guy is unbelievably good.
— KFC Big Bash League (@BBL) January 19, 2025
Here's all the highlights from Glenn Maxwell's 76* off 32 balls! #BBL14 pic.twitter.com/fevthZmuS7
పాపం ఆర్సీబీ!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎన్నో అంచనాలతో మ్యాక్స్‌వెల్‌ను 2021 వేలంలో రూ.14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2022లో రూ.11 కోట్లకు మళ్లీ ఆర్సీబీనే అతడిని అట్టిపెట్టుకుంది. అలా గత నాలుగు సీజన్లపాటు మ్యాక్స్‌వెల్ ఆర్సీబీతోనే కొనసాగాడు. అయితే 2021 సీజన్ మినహా మ్యాక్సీ పెద్దగా ఆకట్టుకోలేదు.
గత సీజన్లో అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో 5.78 యావరేజ్‌తో కేవలం 52 పరుగులే చేసి జట్టుకు భారంగా మారాడు. చివరికి అతడే స్వయంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో తాజా రిటెన్షన్‌లో ఆర్సీబీ అతడిని అట్టిపెట్టుకోకుండా, మెగా వేలంలోకి వదిలేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ అతడు ఫామ్ అందుకోవడంతో పాపం ఆర్సీబీకి ఎప్పుడూ ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆనందంలో పంజాబ్ ఫ్యాన్స్
ఇక 2025 ఐపీఎల్ మెగా వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్ దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్సీని పంజాబ్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలోనూ మ్యాక్స్‌వెల్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్‌కు ముందు అతడు మళ్లీ ఫామ్‌లోకి రావడంతో పంజాబ్ అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు.
'RCBతో నా జర్నీ ముగిసిపోలేదు- ఆల్రెడీ వీడియో కాల్లో మాట్లాడాను!'
మ్యాక్సీ 'ఓవర్రేటడ్' - మాజీ క్రికెటర్‌కు తప్పని ట్రోల్ సెగ - Glenn Maxwell RCB