ETV Bharat / technology

త్వరలోనే మార్కెట్లోకి 'ఎయిర్ ట్యాక్సీ' - గంటకు 250కి.మీ వేగంతో జర్నీ - స్ఫెషల్ ఎట్రాక్షన్ ఇదే! - SARLA AVIATION AIR TAXI

అద్భుత ఫీచర్లతో శూన్య ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ- తొలివిడతగా బెంగళూరులో సేవలు

Sarla Aviation Air Taxi
'శూన్య' ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ (Source- (Sarla Aviation Social Media))
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 5:31 PM IST

Sarla Aviation Air Taxi Shunya Details In Telugu : ఇప్పటిదాకా ట్యాక్సీ అంటే భూతల ప్రయాణం మాత్రమే మనకు తెలుసు. మన అంచనాలకు అందని రేంజ్​లో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ సర్లా ఏవియేషన్ ఎయిర్ ట్యాక్సీ ప్రొటో టైప్‌ను ప్రదర్శించింది. దీనికి శూన్య అని పేరు పెట్టింది.

దిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని తొలిసారిగా ప్రదర్శించారు. దీని ద్వారా 2028 నాటికి బెంగళూరు మహానగరం పరిధిలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని సర్లా ఏవియేషన్ వెల్లడించింది. తదుపరిగా ముంబయి, దిల్లీ, పుణె నగరాలకూ తమ సేవలను విస్తరిస్తామని తెలిపింది. ప్రీమియం వాహన ట్యాక్సీ సర్వీసులు వసూలు చేసే ఛార్జీల రేంజులోనే తమ ఎయిర్ ట్యాక్సీ ఛార్జీలు కూడా ఉంటాయని పేర్కొంది. మహా నగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని కంపెనీ చెప్పింది.

శూన్య ట్యాక్సీ ఫీచర్లు

  • శూన్య ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
  • 20 నుంచి 30 కి.మీ స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.
  • ఈ ట్యాక్సీ గరిష్ఠంగా 680 కేజీల బరువును మోయగలదు. దానిలో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించొచ్చు.
  • ప్రస్తుతం మార్కెట్‌లో ఇంత భారీ బరువును మోయగల ఎయిర్ ట్యాక్సీ అందుబాటులో లేదని సర్లా ఏవియేషన్ చెబుతోంది.

సర్లా ఏవియేషన్ స్టార్టప్ కంపెనీ 2023 అక్టోబరులో ఏర్పాటైంది. దీన్ని అడ్రియన్ ష్మిత్, రాకేశ్ గోవాంకర్, శివం చౌహాన్ కలిసి స్థాపించారు. ఈ కంపెనీ సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్ ద్వారా ఇటీవలే రూ.86 కోట్లు సమీకరించింది. యాక్సెల్ కంపెనీ, ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌లు కలిసి ఈ నిధులను అందించారు. "భారతదేశంలోని నగరాల రవాణా వ్యవస్థను మా కంపెనీ సమూలంగా మార్చబోతోంది. శూన్య ఎయిర్ ట్యాక్సీ అనేది సాంకేతిక విజయాన్ని మించిన వికాసం. ఏ మాత్రం కాలుష్యం లేని విధంగా మా ఎయిర్ ట్యాక్సీ నడుస్తుంది" అని సర్లా ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అడ్రియన్ ష్మిత్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.