మధురై గుడి రాజగోపురానికి కుంభాభిషేకం- హెలికాప్టర్‌తో పూలవర్షం- 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా
🎬 Watch Now: Feature Video
Madurai Alagar Kovil Kumbabishekam Live : తమిళనాడు మధురైలోని అళగర్ కోవిల్ ఆలయ రాజగోపురానికి కుంభాభిషేకం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య పవిత్ర జలంతో గోపుర కలశాలకు అభిషేకం నిర్వహించారు పండితులు. చివరిసారిగా 2011లో ఇక్కడ కుంభాభిషేకం జరిగింది. రాజగోపురాన్ని రూ.2కోట్లతో ఇటీవలే పునర్నిర్మించిన నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత మరోసారి ఈ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
మేలూరుకు సమీపంలో ఉన్న ఈ ఆలయ రాజగోపురం 120 అడుగుల ఎత్తుతో, 7 కలశాలతో వైభవంగా దర్శనమిస్తోంది. చుట్టూ కొండలు, దట్టమైన చెట్ల మధ్య ఆలయం ప్రకృతి శోభతో కళకళలాడుతూ ఉంటుంది. కుంభాభిషేకం నేపథ్యంలో బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8 యాగశాలలను ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు. రంగురంగుల విద్యుద్దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. గురువారం ఉదయం మంగళ వాయిద్యాల మధ్య పవిత్ర తీర్థంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి.. గోపురానికి అభిషేకం చేశారు. అనంతరం, ఆలయంపై హెలికాప్టర్ పుష్పవర్షం కురిపించింది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ మహాక్రతువును చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది.
Ayodhya Ram Statue : బాలుడి రూపంలో అయోధ్య రాముడి విగ్రహం.. 90 శాతం పూర్తి.. భక్తుల ఊహకు మించి
అమెరికా అడవుల్లో అద్భుత శివాలయం- కరెంట్, ఆధునిక పరికరాలు లేకుండానే నిర్మాణం!