Junior Associates Jobs in SBI : ఎస్‌బీఐ భారీ సంఖ్యలో జూనియర్ అసోసియేట్స్ ఖాళీలు భర్తీ చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూలేని విధంగా దేశ వ్యాప్తంగా 13,735 పోస్టులు ఉన్నాయి. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో 342, ఏపీలో 50 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆంగ్లంతో పాటుగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషలో ఎస్‌బీఐ నియామక పరీక్ష రాసుకునే అవకాశం ఉంది.
ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్షలు 2 దశల్లో నిర్వహించి ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారు.
Latest SBI Jobs :మొదటి దశలో నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులు అయిన అభ్యర్థులు రెండో దశలోని మెయిన్స్ ఎక్సామ్ అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షలోని మార్కులను తుది ఎంపికకు పరిణనలోకి తీసునబడవు. అది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
బోనస్ మార్కులు : ఎస్‌బీఐలో అప్రెంటిస్‌షిప్ చేసిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో ఐదు మార్కులు (2.5 %) అదనంగా కలుపుతారు. అయితే ఈ అప్రెంటిస్‌షిప్ 30-11-2024లోగా పూర్తి అయి ఉండాలి.
జీత భత్యాలు ఎలా ఉంటాయంటే? : ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్‌గా ఎంపిక అయిన అభ్యర్థులకు రూ.26,730 మూల వేతనంతో నెల వేతనం ప్రారంభం అవుతుంది. అలవెన్సులతో కలిపి ముంబయి లాంటి ప్రదేశాల్లో రూ.46,000 ప్రారంభ వేతనం. ఇది కాకుండా మెడికల్, పీఎఫ్, లీవ్-ఫేర్,పెన్షన్ ఇలా వివిధ సదుపాయాలూ ఉంటాయి.
నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి :
- జూనియర్ అసోసియేట్స్ పోస్టుల సంఖ్య : 13,735
- విద్యా అర్హతసు : 31-12-24 నాటికి ఏదైనా డిగ్రీ ఉండాలి
- వయసు : 20 నుంచి 28 సంవత్సరాలు (1-4-2024 నాటికి) (జనరల్ అభ్యర్థులకు)
- దరఖాస్తు ఫీజు : రూ.750 (జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్) ఎస్టీ/ఎస్సీ/ దివ్యాంగులు/ఎక్స్‌ఎస్/ డీఎక్స్‌ఎస్ వారికి ఫీజు లేదు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జనవరి 7
- ప్రిలిమ్స్ పరీక్ష : ఫిబ్రవరి 2025
- మెయిన్ పరీక్ష : మార్చి/ ఏప్రిల్ 2025
మరిన్ని వివరాలకు www.sbi.co.inలో చూడవచ్చు.
రైల్వే భారీ నోటిఫికేషన్ - న్యూ ఇయర్‌లో 32,438 గ్రూప్-డి పోస్టులు భర్తీ!