iQOO Neo 10R India Launch Timeline: వివో సబ్-బ్రాండ్ కంపెనీ ఐకూ గతేడాది నవంబర్ నెలలో తన హోమ్ మార్కెట్ చైనాలో మిడ్-ప్రీమియం రేంజ్ ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. 'ఐకూ నియో 10' పేరుతో తీసుకొచ్చిన ఈ సిరీస్‌లో 'నియో 10', 'నియో 10 ప్రో' అనే రెండు మోడల్స్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ రెండు మోడల్ ఫోన్ల గ్లోబల్ లాంఛ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కంపెనీ ఈ సిరీస్‌లో 'ఐకూ నియో 10R' అనే కొత్త మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
భారత్‌లో ఐకూ నియో 10R లాంఛ్ టైమ్‌లైన్: ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతున్న 'ఐకూ నియో 10R' స్మార్ట్‌ఫోన్ మెమరీ ఆప్షన్లు ఇటీవలే లీక్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఫోన్ గురించి పాసిబుల్ లాంఛ్ టైమ్‌లైన్‌తో పాటు కొన్ని ప్రత్యేక స్పెసిఫికేషన్లపై లీక్స్ వచ్చాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ఐకూ నియో లైనప్‌లో మొదటి R-సిరీస్ మోడల్ అవుతుంది. ఇది I2221 మోడల్ నంబర్‌తో ఉండటాన్ని గుర్తించారు. టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ తన ఒక పోస్ట్ ద్వారా ఐకూ ఈ ఫోన్‌ను 2025లో భారతదేశంలో లాంఛ్ చేయొచ్చని పేర్కొన్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఎగ్జాక్ట్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ఇప్పటివరకూ ఏ టిప్‌స్టర్ కూడా దీని గురించి ఎలాంటి సమాచారం అందించలేదు.
Xclusive: IQOO NEO 10R 5G (India)
— Paras Guglani (@passionategeekz) January 20, 2025
I2221
6.78" amoled 144hz
8s gen 3
8gb+256gb, 12gb+256gb
50mp sony lyt-600, 8mp wide, 16mp front
6400 mah ="" 80w
blue white slice, lunar titanium
under 30k
feb 2025#IQOO #IQOONeo10R #IQQNEO10R5G
ఐకూ నియో 10Rలో అంచనా స్పెసిఫికేషన్లు: టిప్‌స్టర్ ప్రకారం ఈ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 144Hz. ఇది జరిగితే ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ 'ఐకూ నియో 10', 'నియో 10 ప్రో' మోడల్స్‌కు సమానంగా ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ కోసం క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. అయితే 'ఐకూ నియో 10' చైనీస్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను అందించారు.
వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో లాంఛ్ చేయొచ్చు.
- 8GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 256GB స్టోరేజ్
అయితే ఈ ఫోన్‌పై లీకైన పాత నివేదిక ప్రకారం దీన్ని 8GB RAM అండ్ 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో కూడా రిలీజ్ చేయొచ్చు.
కెమెరా సెటప్: ఈ ఫోన్ వెనక భాగంలో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించొచ్చు. దీనితో పాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌ను 16MP ఫ్రంట్ కెమెరాతో తీసుకురావొచ్చు.
ఈ ఫోన్‌లో 6400mAh పెద్ద బ్యాటరీ ఉందని, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడా వస్తుందని సమాచారం. చైనీస్ వేరియంట్‌లో 'ఐకూ నియో 10' సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ కంపెనీ 6100mAh బ్యాటరీని ఇచ్చింది.
కలర్ ఆప్షన్స్: లీకైన టిప్‌స్టర్ నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లలో తీసుకురావొచ్చు.
- లూనార్ టైటానియం
- బ్లూ వైట్ స్లైస్
ఐకూ నియో 10R అంచనా ధర: భారత మార్కెట్లో 'ఐకూ నియో 10R' బేస్ మోడల్‌ను రూ. 30,000 లోపు లాంఛ్ చేయవచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఈ ధరతో ఈ ఫోన్ పోకో నుంచి వచ్చిన లేటెస్ట్ 'పోకో X7 ప్రో', 'మోటొరోలా ఎడ్జ్ 50 ప్రో'తో పాటు 'నథింగ్ ఫోన్ 2a' స్మార్ట్ఫోన్లతో పోటీ పడగలదు.
భారత్‌లో ఎండతో నడిచే కారు వచ్చేసిందోచ్- సోలార్ రూఫ్‌తో బడ్జెట్ ధరలోనే లాంఛ్!
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో స్లిమ్ మోడల్!- ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంతంటే?
2025 మోడల్ కవాసకి నింజా 500 బైక్ వచ్చేసిందోచ్!- ఇప్పుడు దీనిపై రూ.50వేలు అదనంగా చెల్లించాల్సిందే!