BCCI Naman Awards : అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు బీసీసీఐ నమన్ అవార్డులతో సత్కరించింది. ముంబయిలో శనివారం జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బీసీసీఐ సచిన్‌ను 'జీవిత సాఫల్య పురస్కారం' (Lifetime Achievement Award)తో గౌరవించింది.
CK నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈసారి సచిన్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో సచిన్ తెందూల్కర్‌కు ఐసీసీ ఛైర్మన్ జై షా అవార్డు ప్రదానం చేశాడు. ఇక 2023- 24 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఎంపికైంది.
🚨 𝗖𝗼𝗹. 𝗖.𝗞. 𝗡𝗮𝘆𝘂𝗱𝘂 𝗟𝗶𝗳𝗲𝘁𝗶𝗺𝗲 𝗔𝗰𝗵𝗶𝗲𝘃𝗲𝗺𝗲𝗻𝘁 𝗔𝘄𝗮𝗿𝗱 🚨
— BCCI (@BCCI) February 1, 2025
He has given innumerable moments for cricket fans to celebrate and today we celebrate the Master 🫡🫡
The legendary Mr. Sachin Tendulkar receives the prestigious award 🏆
Many congratulations… pic.twitter.com/C3lE7Cfdsd
అవార్డుల కంప్లీట్ లిస్ట్
- సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - సచిన్
- పాలి ఉమ్రిగర్ అవార్డు - ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్ - బుమ్రా
- ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్: స్మృతి మంధాన
- ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (పురుషులు): సర్ఫరాజ్ ఖాన్
- ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం (మహిళలు): ఆశా శోభనా
- బీసీసీఐ స్పెషల్ అవార్డు: రవిచంద్రన్ అశ్విన్
- వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్: స్మృతి మంధాన
- వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ : దీప్తి శర్మ
- దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్: అక్షయ్ తోట్రే
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ - కావ్యా
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U19 కూచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ - విష్ణు భరద్వాజ్
- జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ- బెస్ట్ విమెన్ క్రికెటర్ సీనియర్ డొమెస్టిక్: ప్రియా మిశ్రా
- జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ- బెస్ట్ విమెన్ క్రికెటర్ జూనియర్ డొమెస్టిక్: ఈశ్వరీ అవసరే
- జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్: హెచ్. జగన్నాథన్
- జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ-U16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్: లక్ష్య రాయ్‌చందానీ
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్ గ్రూప్): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్: నీజెఖో రుప్రియో
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ప్లేట్ గ్రూప్): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్: హేమ్ ఛెత్రి
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్ గ్రూప్): అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్: పి. విద్యుత్
- ఎం.ఎ. చిదంబరం ట్రోఫీ- U23 సీకే నాయుడు ట్రోఫీ(ఎలైట్ గ్రూప్): అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్: కేవీ అనీశ్
- మాధవ్‌రావ్ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్ గ్రూప్)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్: మోహిత్ జాంగ్ర
- మాధవ్‌రావ్ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్)- అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్: తనయ్ త్యాగరాజన్
- మాధవ్‌రావ్ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ప్లేట్ గ్రూప్)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్: అగ్ని చోప్రా
- మాధవ్‌రావ్ సింధియా అవార్డు- రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్)- అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్- రికీ భూయ్
- లాలా అమర్‌నాథ్ అవార్డు- బెస్ట్ ఆల్‌రౌండర్ (డొమెస్టిక్ లిమిటెడ్ ఓవర్స్ కాంపిటీషన్)-శశాంక్‌సింగ్
- లాలా అమర్‌నాథ్ అవార్డు- బెస్ట్ ఆల్‌రౌండర్ (రంజీ ట్రోఫీ)-తనుశ్ కోటియన్
- బెస్ట్ పెర్ఫామెన్స్ ఇన్ బీసీసీఐ డొమెస్టిక్ టోర్నమెంట్స్: ముంబయి
భారత్ తరఫున బరిలోకి సచిన్ తెందూల్కర్- లైవ్ ఎక్కడ చూడాలంటే?
సచిన్‌కు బీసీసీఐ ఘన సత్కారం - ఈ అవార్డుతో ఆ దిగ్గాజాల లిస్ట్‌లోకి!