Sudan Paramilitary Attack : సుడాన్ ఓమ్‌దుర్మాన్ నగరంలోని ఓపెన్ మార్కెట్‌పై పారామిలిటరీ గ్రూపు శనివారం జరిపిన దాడిలో 54మంది మృతి చెందగా, మరో 158 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నట్లు సుడాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ సైన్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ పారామిలిటరీ గ్రూపు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుడాన్ అధికారిక ప్రతినిధి ఖలీద్ అల్ అలీసర్ ఆ దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలాగే ఈ దాడిలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనట్లు ఆయన పేర్కొన్నారు.