ETV Bharat / technology

భారత్​లో ఎండతో నడిచే కారు వచ్చేసిందోచ్- సోలార్​ రూఫ్​తో బడ్జెట్ ధరలోనే లాంఛ్! - VAYVE EVA ELECTRIC CAR LAUNCHED

ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటి సోలార్ ఈవీ లాంఛ్- ధర, ఫీచర్లు ఇవే!

Vayve Eva Mini Electric Car
Vayve Eva Mini Electric Car (Photo Credit- Vayve)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 21, 2025, 4:02 PM IST

Vayve Eva Electric Car Launched: మన ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటి సోలార్ కారు లాంఛ్ అయింది. దీన్ని పుణెకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వేవ్ మొబిలిటీ (Vayve Mobility) భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. 'వేవ్ ఎవా' పేరుతో తీసుకొచ్చిన సౌరశక్తితో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారు (EV)ను కంపెనీ రూ. 3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది.

ఈ సౌరశక్తితో నడిచే కారు బుకింగ్స్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. దీన్ని బుక్ చేసుకోవాలంటే రూ. 5,000 అడ్వాన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే 'వేవ్ ఎవా' డెలివరీలు 2026 సెకండ్ హాఫ్ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ కారును ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25,000 మంది కస్టమర్లకు అదనపు ఫీచర్లను అందిస్తామని కూడా పేర్కొంది. వీటిలో ఎక్స్​టెన్డెడ్ బ్యాటరీ వ్యారెంటీ, 3 సంవత్సరాల ఉచిత వాహన కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

బ్యాటరీ ప్యాక్స్: కంపెనీ ఈ కారును మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకొచ్చింది.

  • 9 kWh
  • 12 kWh
  • 18 kWh

దీని అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

వేరియంట్స్: ఈ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లంలో లభిస్తుంది.

  • నోవా
  • స్టెల్లా
  • వేగా

సబ్​స్క్రిప్షన్: వేవ్ ఎవా బ్యాటరీ ప్యాక్​ను కిలోమీటరుకు రూ. 2 చొప్పున సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీంతో బ్యాటరీలపై ఎక్కువ మొత్తంలో ప్రారంభ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సబ్​స్క్రిప్షన్​ కోసం మినిమమ్ వార్షిక మైలేజ్ ఉంటుంది. ఇది నోవా వేరియంట్​కు 600 కి.మీ, స్టెల్లా వేరియంట్​కు 800 కి.మీ, వేగా వేరియంట్​కు 1200 కి.మీ. అంటే మీరు వాస్తవంగా తక్కువ డ్రైవింగ్ చేసినప్పటికీ ఈ కనీస దూరాలకు కస్టమర్ల నుంచి ఛార్జీ వసూలు చేస్తారన్నమాట.

కంపెనీ ఇనీషియల్ సర్వేల ప్రకారం చిన్న సైజ్, లైట్ వెయిట్ పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ రన్నింగ్ ఖర్చు కిలోమీటరుకు 5 రూపాయలు. కానీ దాని అధిక సామర్థ్యం ఫలితంగా ఎవా దాన్ని పదోవంతు (1/10వ వంతు) తగ్గించి కిలోమీటరుకు రూ. 0.5కి తగ్గించింది. ​దీని హై-ఎఫిషియెన్సీ ఎవా ఆప్షనల్ సోలార్ రూఫ్​తో 3,000 కిలోమీటర్ల వరకు ఉచిత సౌర ఛార్జింగ్‌ను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణ పట్టణ ప్రయాణికుల వార్షిక డ్రైవింగ్ రిక్వైర్మెంట్​లో 30 శాతం వరకు ఉంటుంది.

వేవ్ ఎవా మల్టిపుల్ బ్యాటరీ అండ్ మోటార్ ఆప్షన్లతో వస్తుంది. దీని ప్రతి వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. దీనితో పాటు సోలార్ రూఫ్ ప్యానెల్ ప్రతిరోజూ 10 కిలోమీటర్ల రేంజ్​ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాక ఎవా గరిష్టంగా గంటకు 70 కి.మీ వేగాన్ని అందుకోగలదని, 5 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని చేరుకోగలదని వేవ్ మొబిలిటీ చెబుతోంది.

వేవ్ ఎవా ఫీచర్లు: కారులో ట్విన్-స్క్రీన్ సెటప్ ఉంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వీటితో పాటు మాన్యువల్ AC, యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

2025 మోడల్ కవాసకి నింజా 500 బైక్ వచ్చేసిందోచ్!- ఇప్పుడు దీనిపై రూ.50వేలు అదనంగా చెల్లించాల్సిందే!

BMW కొత్త అడ్వెంచర్ బైక్ చూశారా?- బాక్సీ డిజైన్​లో భలే ఉందిగా!- ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​లో స్లిమ్ మోడల్​!- ఈ స్పెషల్ ఎడిషన్ ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.