Horoscope Today January 7th 2025 : 2025 జనవరి 7వ తేదీ (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటారు. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి పరంగా విజయం మీ తలుపు తడుతుంది. సానుకూల దృక్పధంతో చేసే ఆలోచనలన్నీ ఆశాజనకంగా సాగుతాయి. దైవబలం అండగా ఉంటుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం పరిపూర్ణంగా ఉంటుంది. మీ పిల్లల గురించి ఒక శుభవార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంది. అయితే, సరైన చోట పెట్టుబడి పెడుతున్నారని ఖచ్చితంగా నిర్ధారించుకోండి; చట్టపరమైన, కోర్టుకి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అటు వృత్తి పరమైన బాధ్యతలు, ఇటు ఇంటి పనులు, బాధ్యతలతో ఈ రోజంతా తీరిక లేకుండా గడుపుతారు. మీ పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. బంధువుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందేందుకు మరింత కష్టపడాలి. పరోపకారం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఎంత కష్టమైన పని అయినా సరదాగా, వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో అనుకోని మలుపు జరుగుతుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు ధ్యానం శుభకరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బాల్య మిత్రులతో కులాసాగా గడుపుతారు. విహారయాత్రలు ఆహ్లాదంగా సాగుతాయి. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కలిగివుంటారు. ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణిస్తుంది. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం అవసరం. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం శుభకరం.
తుల (Libra) : తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీడియా రంగం వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ నైపుణ్యంతో అందరిని ఆకర్షిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృథా ఖర్చులు పెరిగే సూచన ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. శివారాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్ధిక అంశాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీ, పదోన్నతులు ఉండవచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలతో సతమతమవుతారు. ఇంట్లో శాంతి కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనం ఇవ్వకపోవచ్చు. మీ తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆర్ధిక పరిస్థితి క్షీణించకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచిది.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురవుతాయి. ఊహించని ఖర్చులు చుట్టుముడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సమస్యలు తీవ్రమవుతాయి. శని శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం సరిగా లేనందున ఈ రోజు అన్ని వైపులా నుంచి ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకోలేక పోతే కుటుంబ కలహాలు తప్పవు. ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ కూడా వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. దుర్గాస్తుతి పారాయణ మేలు చేస్తుంది.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. పాత, మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. వృత్తిలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఆర్ధిక సమస్యలు రాకుండా పొదుపు చర్యలు పాటించాలి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.