ETV Bharat / spiritual

మహా కుంభమేళాలో రెండో రాజ స్నానం ఎప్పుడు? ఎలా ఆచరించాలి? - KUMBH MELA 2025

కుంభమేళాలో రెండో రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి? శాస్త్రోక్తంగా రాజ స్నానం ఎలా ఆచరించాలి?

Kumbh Mela 2025
Kumbh Mela 2025 (Getty Imagees)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 3:41 AM IST

Kumbh Mela Second Raja Snanam When : భారతదేశంలో జరిగే అతిపెద్ద ఆధాత్మిక ఉత్సవం మహా కుంభమేళా! మహా కుంభ మేళా జాతర 2025 జనవరి 13వ తేదీ నుంచి మొదలు కానున్న సందర్భంగా రెండో రాజ స్నానం ఎప్పుడు ఆచరించాలి? శాస్త్రోక్తంగా రాజ స్నానం ఎలా ఆచరించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రెండో రాజ స్నానం ఎప్పుడు?
ప్రయాగ్ రాజ్ లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరగనుండగా, రెండో రాజ స్నానం అత్యంత పవిత్రమైన మకర సంక్రాంతి జనవరి 14 న జరుగనుంది. ఈ సందర్భంగా కుంభమేళాలో రెండో రాజ స్నానం చేయడానికి శుభ సమయం ఎప్పుడు? స్నానం చేసేటప్పుడు ఎలాంటి ఆచారాలు పాటించాలంటే?

రెండో రాజ స్నానానికి శుభ సమయం
2025లో జనవరి 14న మకర సంక్రాంతి పండగ వచ్చిన నేపథ్యంలో రెండో రాజ స్నానం మకర సంక్రాంతి రోజున చేయాల్సి ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 14 వ తేదీ మంగళవారం 2:45 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి రెండవ రాజ స్నానం ఆచరించడానికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత శుభ సమయం మొదలవుతుంది. రెండవ రాజ స్నానం ఆచరించడానికి సాయంత్రం 5.27 నుంచి 6.21 వరకు సుముహూర్తమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

శాస్త్రోక్తంగా రాజ స్నానం చేయాల్సిన విధి
మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా నదీమతల్లికి నమస్కరించుకుని నది ఒడ్డు నుంచి కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నదిలోకి ప్రవేశించాలి. సేకరించిన మట్టిని నదిలో కలపాలి. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునగాలి. తరువాత దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి. తరువాత నది బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించాలి. అరటి దొన్నె లో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వలన పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుంది.

మకర సంక్రాంతి రాజ స్నానం ప్రాముఖ్యం
మకర సంక్రాంతి రోజున కుంభమేళా సమయంలో చేసే స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం. మకర సంక్రాంతి రోజున స్నానం చేసిన వారు ఇహ పర సుఖాలను పొందుతారని నమ్ముతారు. కుంభమేళాలో మకర సంక్రాంతి రెండో రాజస్నానం చేసిన వారికి 10 అశ్వమేధ యాగాలు, 1,000 గోవులను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అత్యంత ఫలదాయకమని విశ్వాసం.

ఈ దానాలు శ్రేష్టం
మకర సంక్రాంతి రోజున స్నానంతో పాటు దానాలు చేయడం శుభప్రదం. మకర సంక్రాంతి రోజున చేసే దానాలు వల్ల జీవితంలోని కఠినమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున బియ్యం, నెయ్యి, బెల్లం, ఉన్ని దుస్తులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. రానున్న మహా కుంభమేళాలో వీలైతే మనం కూడా పాల్గొని రాజ స్నానం చేద్దాం- తరిద్దాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.