ETV Bharat / bharat

దేశంలో HMPV వైరస్ కలకలం - 7కు పెరిగిన కేసులు - అందరూ పసిబిడ్డలే! - HMPV VIRUS OUTBREAK

'చైనా వైరస్​ వ్యాప్తిపై ఆందోళన అక్కర లేదు' - కానీ అప్రమత్తంగా ఉండాల్సిందే!

HMPV virus outbreak
HMPV virus outbreak (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 7:02 AM IST

HMPV Virus Outbreak : చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్​ మెటా న్యుమో వైరస్​ (HMPV) భారత్​లోకీ విస్తరించింది. సోమవారం ఏకంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో గుజరాత్​లో 1, కర్ణాటక, నాగ్​పుర్​, తమిళనాడుల్లో రెండేసి హెచ్​ఎంపీవీ కేసులు రికార్డ్ అయ్యాయి. పైగా ఈ వైరస్​ బారిన పడిన వారందరూ నెలల బిడ్డలే కావడం గమనార్హం. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్​ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

డోంట్ వర్రీ - కోలుకుంటున్నారు!
సోమవారం బెంగళూరులో ఇద్దరు పసికందులు (ఒక ఆడ, ఒక మగ బిడ్డ) శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో వారికి హెచ్​ఎంపీవీ వైరస్​ సోకినట్లు గుర్తించారు. తరువాత ట్రీట్​మెంట్ ఇవ్వగా మూడు నెలల చిన్నారి కోలుకుని, ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్​ కాగా, మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. భారత్​లోని తొలి హెచ్​ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) పేర్కొంది. చైన్నైలో మరో ఇద్దరు శిశువులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వారు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. అలాగే రాజస్థాన్​కు చెందిన 2 నెలల శిశువు కూడా ఈ వైరస్ బారిన పడింది. వీరందరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ శిశువులు తల్లిదండ్రులు ఎవ్వరికీ విదేశీ ప్రయాణాలు చేసిన నేపథ్యం లేదు. మరి ఈ వైరస్ ఎలా భారత్​లోకి వచ్చిందో తెలియాల్సి ఉంది.

భయపడాల్సిన పనిలేదు!
దేశంలో హెచ్​ఎంపీవీ వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ వైరస్‌ కొత్తదేమీ కాదన్నారు. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీసీ నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. కనుక ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.

"హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ కాదని ఆరోగ్య రంగ నిపుణులు స్పష్టంచేశారు. ఈ వైరస్‌ని 2001లో గుర్తించారు. చాలా ఏళ్లుగా ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉంది. గాలి, శ్వాసప్రక్రియ ద్వారా ఈ వైరస్​ వ్యాపిస్తుంది. అన్ని వయసుల వారినీ ప్రభావితం చేస్తుంది. శీతాకాలం, వసంత రుతువు ప్రారంభంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం, చైనాలో ఈ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆరోగ్యమంత్రిత్వశాఖ, ఐసీఎంఆర్‌, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్​సీడీసీ) చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సైతం ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని, త్వరలోనే నివేదికను మనకు అందజేస్తుంది.. ఐసీఎంఆర్‌, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌తో మన దేశంలోని శ్వాసకోశ వైరస్‌లకు సంబంధిత డేటాను సమీక్షించాయి. సాధారణ వ్యాధికారక వైరస్‌లలో ఏ విధమైన పెరుగుదల నమోదు కాలేదు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు జనవరి 4న డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ ఫర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్​ఎస్​) అధ్యక్షతన జాయింట్‌ మానిటరింగ్‌ సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణ స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు" అని నడ్డా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.