Best Post Office Scheme 2025 : దీర్ఘకాలం పాటు పొదుపు చేయాలని భావించే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉత్తమమైనవి. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) మంచి రాబడిని అందిస్తాయి. కనిష్ఠంగా ప్రతినెలా రూ.100 చొప్పున కూడా రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఉద్యోగాలు/వ్యాపారాలు చేసేవారు ప్రతినెలా రూ.5వేలు చొప్పున పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీంలో జమ చేస్తే, కొన్నేళ్ల తర్వాత అవి ఏకంగా రూ.8.54 లక్షలు అవుతాయి. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.
నెలకు రూ.5వేలు చొప్పున జమచేస్తే?
- ఉదాహరణకు మీరు ప్రతినెలా రూ.5వేలు చొప్పున పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌లో జమ చేశారని భావిద్దాం. అప్పుడు సంవత్సరానికి రూ.60వేలు జమ అవుతాయి.
- ఐదేళ్లలో రూ.3 లక్షలు అవుతాయి. వీటిపై ఐదేళ్లలో 6.7 శాతం చొప్పున వడ్డీ ఆదాయం మీకు లభిస్తుంది. అవి దాదాపు రూ.56,830 అవుతాయి.
- ఒకవేళ మీరు ఈ స్కీమ్‌ను మరో ఐదేళ్లు కొనసాగిస్తే మరింత ప్రయోజనం దక్కుతుంది.
- ఇంకో ఐదేళ్లలో (మొత్తం పదేళ్లు) మీరు ఈ స్కీమ్‌లో జమచేసిన మొత్తం రూ.6 లక్షలకు చేరుతుంది. 6.7 శాతం వడ్డీతో కలుపుకొని, అక్షరాల మీ చేతికి రూ.8,54,272 అందుతుంది.
లోన్ కూడా వస్తుంది!
- ఈ పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీంలో మనం ఎంతైతే మొత్తాన్ని జమ చేశామో, ఆ మొత్తంలో 50 శాతాన్ని లోన్‌గా తీసుకోవచ్చు.
- రికరింగ్ డిపాజిట్‌పై మీకు లభించే వడ్డీ కంటే 2 శాతం ఎక్కువగా ఈ రుణంపై వడ్డీరేటును విధిస్తారు.
- అయితే ఈ స్కీమ్‌లో కనీసం కొన్నేళ్ల పాటు కొనసాగిన తర్వాతే రుణం పొందే అవకాశం లభిస్తుంది.
- ఈ స్కీం నుంచి మన ఇష్టం వచ్చినప్పుడు వైదొలగలేము. కనీసం మూడేళ్ల తర్వాతే ఈ స్కీమ్ నుంచి వైదొలగే అవకాశం ఇస్తారు.
చిన్నారుల కోసం సూపర్ స్కీమ్!
ఇండియన్ పోస్టాఫీస్ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన ఆ స్కీమ్ పేరు 'బాల్ జీవన్ బీమా పథకం'. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు, వారి ఆర్థిక స్తోమతను బట్టి కనిష్ఠంగా రోజుకు రూ.6 నుంచి గరిష్ఠంగా రూ.18 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద ఈ స్కీమ్‌లో పొదుపు చేయవచ్చు. బాల్ జీవన్ బీమా పథకంలో 5 నుంచి 20 ఏళ్లలోపు పిల్లల పేరుపై పొదుపు చేయవచ్చు. అయితే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - రోజూ రూ.95 పెట్టుబడితో రూ.14 లక్షలు మీ సొంతం!
రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ - టాప్ 10 గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!