Ramoji Film City : యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బుధవారం రామోజీ ఫిల్మ్సిటీనీ సందర్శించారు. బాహుబలి సెట్లో ఉల్లాసంగా గడిపిన ఆమె చిత్రనగరిలోని అందాలను తిలకించారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్లు సహరీ, బృహతీలను కలిశారు. అనంతరం ఈటీవీ భారత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈటీవీ భారత్ కార్యకలాపాలను సంస్థ సీఈవో జొన్నలగడ్డ శ్రీనివాస్ ఆమెకు వివరించారు. మీడియా రంగంలో రామోజీ గ్రూప్ సంస్థల నిబద్ధతను కొనియాడారు. యూఎస్ కాన్సుల్ జనరల్ వెంట పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్ లారెన్, మీడియా అడ్వైజర్ అబ్దుల్ సమద్ ఉన్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన యూఎస్ కాన్సుల్ జనరల్ - US CONSUL GENERAL
రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన యూఎస్ కాన్సుల్ జనరల్ - బాహుబలి సెట్లో ఉల్లాసంగా గడిపిన జెన్నీఫర్ లార్సన్ - ఈటీవీ భారత్ కార్యాలయాన్ని సందర్శించిన జెన్నీఫర్ లార్సన్
Published : Jan 23, 2025, 8:38 AM IST