ETV Bharat / state

తెలంగాణలో కుల గణన సర్వే వివరాలు వెల్లడి- ఓసీల జనాభా 15.79 శాతం, మరీ బీసీలు ఎంతంటే - UTTAM KUMAR ON CASTE CENSUS SURVEY

కులగణన అంశంపై ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం - మంత్రి ఉత్తమ్‌కుమార్ అధ్యక్షతన సమావేశమైన సబ్‌కమిటీ - రాష్ట్రంలో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘానికి అందిన నివేదిక - ముఖ్యాంశాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar On Caste Census Survey
Minister Uttam Kumar On Caste Census Survey (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 7:08 PM IST

Updated : Feb 2, 2025, 8:43 PM IST

Minister Uttam Kumar On Caste Census Survey : వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై కేబినెట్ సబ్​ కమిటీకి(మంత్రివర్గ ఉపసంఘం) నివేదిక అందజేశారు. కులగణనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక, కులగణన సర్వే చేపట్టామని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో కుల గణన సర్వే వివరాలు వెల్లడి- ఓసీల జనాభా 15.79 శాతం, మరీ బీసీలు ఎంతంటే (ETV Bharat)

96.9శాతం మంది వివరాలందించారు : స్వాతంత్య్రం పూర్వం నుంచి మనదేశంలో జనగణన జరుగుతోందని, అసలైన పేదలను గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని వివరించారు. బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణకు కులగణన చేపట్టామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని తెలిపారు. 96.9శాతం (3.50 కోట్ల మంది) మంది సర్వేలో పాల్గొని వివరాలను అందించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. 3.1శాతం (16లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని తెలిపారు.

కేబినెట్​లో చర్చించి శాసనసభలో ప్రవేశపెడతాం : ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని వివరించారు. ఈనెల 4న మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతాని ఆయన వెల్లడించారు. కేబినెట్‌లో చర్చించి వెంటనే శాసనసభలో ప్రవేశ పెడతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

కులగణన సర్వేలోని ముఖ్యాంశాలు ఇవే :

  • తెలంగాణ రాష్ట్రంలోని 3,54,77,554 మంది వివరాల నమోదు.
  • మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేశారు.
  • కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం మంది.
  • కులగణన సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం మంది
  • కులగణన సర్వే ప్రకారం తెలంగాణలో ఎస్సీల జనాభా 17.43 శాతం
  • ఎస్టీల జనాభా : 10.45 శాతం మంది
  • రాష్ట్రంలో బీసీల జనాభా : 46.25 శాతం మంది
  • రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతం మంది
  • ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం
  • రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
  • రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం
  • రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం

'సమగ్ర కులగణన అన్ని పథకాలకు మెగా హెల్త్​ చెకప్​లా ఉపయోగపడుతుంది'

'60 రోజుల్లో బీసీ కుల గణన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం - ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు'

Last Updated : Feb 2, 2025, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.