IND VS ENG Abhishek Sharma Century : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. సూపర్ ఫామ్‌తో 37 బంతుల్లో సెంచరీ(135) బాదాడు. 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనీయకుండా చేశాడు!. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో శతకం చేశాడు.
అంతేకాకుండా టీ20 మ్యాచ్‌లో అత్యధికంగా సిక్స్‌లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అభిషేక్ కంటే ముందు రోహిత్ శర్మ (శ్రీలంకతో జరిగిన 2017 మ్యాచ్‌లో ), సంజు శాంసన్ (సౌత్ ఆఫ్రికాతో), తిలక్ వర్మ (సౌత్ ఆఫ్రికా) టీ20ల్లో పదేసి సిక్స్‌లు బాదారు.
Second T20I CENTURY for Abhishek Sharma! 💯
— BCCI (@BCCI) February 2, 2025
Wankhede has been entertained and HOW! 🤩#TeamIndia inching closer to 150 🔥
Live ▶️ https://t.co/B13UlBNdFP#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vY4rtG0CXb
17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
17 బంతుల్లోనే అర్ధ శతకం బాది వేగవంతమైన ఫిఫ్టీల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ శర్మ. దీంతో భారత్‌లో టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధ శతకం బాదాడు.
అభిషేక్ సునామీ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ఇండియా 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 248 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఓ దశలో 280+ పరుగులు సులభంగా వస్తాయనుకున్నా అభిషేక్‌కు తిలక్ (24), దూబె (30) మినహా ఇతర బ్యాటర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో 235తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శాంసన్ (16), సూర్య (2), పాండ్య (9), రింకు (9) నిరాశపరిచారు . అక్షర్ (15) ఆఖరులో వేగంగా ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో కార్స్ 3, వుడ్ 2, ఆర్చర్, రషీద్, ఒవర్టన్ తలో వికెట్ తీశారు.