ETV Bharat / offbeat

ఎప్పుడైనా "మునగ చపాతీలు" తిన్నారా? - ప్రిపరేషన్ వెరీ ఈజీ! - బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్! - MORINGA CHAPATI RECIPE

ఆరోగ్యానికి మేలు చేసే "మునగ చపాతీలు" - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!

MORINGA CHAPATI
Munaga Chapati Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 5:29 PM IST

Munaga Chapati Recipe in Telugu : ప్రస్తుత రోజుల్లో మెజార్టీ పీపుల్ చపాతీ తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారితో పాటు బీపీ, షుగర్​ను కంట్రోల్​లో పెట్టాలనుకునేవారూ కనీసం రోజులో ఒకపూటైనా చపాతీలను డైట్​లో చేర్చుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేరకమైన చపాతీలు తినాలంటే ఎవరికైనా బోరింగ్​ ఫీల్ వచ్చేస్తుంది. అలాంటి వారు ఓసారి ఇలా "మునగ చపాతీలు" ట్రై చేయండి. ఇవి మామూలు చపాతీ కన్నా సూపర్ టేస్టీగా ఉంటాయి! పైగా మునగలో ఐరన్, పొటాషియం, జింక్ ఇలా శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ రెసిపీగా చెప్పుకోవచ్చు! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ మునగ చపాతీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • గోధుమపిండి - 1 కప్పు
  • మునక్కాయలు - 5
  • వేయించిన మునగాకు - అరకప్పు
  • కొత్తిమీర తరుగు - 2 చెంచాలు
  • నూనె - చెంచా
  • కారం - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - చిటికెడు
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • వేయించిన నువ్వులు - కొన్ని

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మునక్కాయలను ముక్కలుగా కోసి, ఉడికించి పప్పుగుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పిప్పిని వేరు చేసి గుజ్జుని ఒక మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో గోధుమపిండి, సన్నగా కట్ చేసి వేయించుకున్న మునగాకు, సన్నని కొత్తిమీర తరుగు, నూనె వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆపై ఆ మిశ్రమంలో కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన నువ్వులు యాడ్ చేసుకొని మరోసారి పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • అయితే, పిండి మిక్స్ చేసుకునేటప్పుడు మునగ గుజ్జులో ఉన్న తడి సరిపోలేదనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలిపి అరగంట పాటు పక్కనుంచాలి.
  • అనంతరం 30 నిమిషాలు నానిన పిండి ముద్దను తీసుకొని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత చపాతీ పీటపై ఒక్కో పిండి ఉండను ఉంచి చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై రొట్టెల పెనం పెట్టుకొని వేడిచేసుకోవాలి. పెంకు వేడయ్యాక కాస్త నూనె లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆపై ముందుగా చేసుకున్న చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే, నోరూరించే "మునగ చపాతీలు" రెడీ!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ చపాతీలను ట్రై చేయండి. రుచికరంగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

ఇవీ చదవండి :

ఫ్రిడ్జ్​లో పెట్టినా "చపాతీ పిండి" త్వరగా పాడవుతోందా? - ఈ టిప్స్​తో చాలా ఫ్రెష్​గా ఉంటుంది!!

రక్తహీనత సమస్యా? - ఇలా బీట్​ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.