ETV Bharat / spiritual

ఆ రాశుల వారి జీవితాల్లో ఈ వారం కీలక మార్పులు! ఆదిత్య హృదయం పారాయణం శుభకరం!! - WEEKLY HOROSCOPE

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు వారఫలాలు

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 5:12 AM IST

Weekly Horoscope From February 9th To February 15th 2025 : ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ నిర్లక్ష్యం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ధన నష్టం సంభవించే సూచన ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు వేచి చూస్తే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ అహంకారం కారణంగా జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. భూమి, ఇల్లు, ఆస్తి కొనుగోళ్లు వాయిదా వేస్తే మంచిది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా వ్యహరించాల్సిన సమయం. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అవసరం. వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలను సన్నిహితుల సహకారంతో అధిగమిస్తారు. ప్రమాదాలకు దూరంగా ఉంటే మంచిది. కష్ట సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఓదార్పునిస్తుంది. స్వబుద్ధితో, సొంత నిర్ణయాలతో లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారిస్తే మంచిది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వొద్దు. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉంది. పదోన్నతులు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యం మెరుగు పడుతుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో స్వీయ నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను అందుకుంటారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితంలో పాత చికాకులను తొలగించుకుని ముందుకు సాగుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.కుటుంబ సభ్యులతో తీర్ధ యాత్రలకు వెళ్తారు. వ్యాపారస్తులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరణ చేస్తారు. విదేశీ వ్యక్తులతో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో ఆశించిన విజయాలు సాధిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే గృహంలో సుఖశాంతులు ఉంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గతంలోని అనారోగ్య సమస్యలు తిరగబెట్టవచ్చు. అజాగ్రత్త వల్ల చాలా బాధను అనుభవించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడాలి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. ఒక చిన్న పొరపాటు సన్నిహితులతో సంబంధాన్ని దెబ్బ తీస్తుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. శనిస్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ మీద అధిక శ్రద్ధ పెడతారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. ఒక వ్యవహారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం కొంత సవాలుగా ఉంటుంది. సమయానుకూలంగా నడుచుకోవడం వలన సమస్య తీవ్రత తగ్గుతుంది. వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. భాగస్వాముల సహకారంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. విద్యార్థులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన కృషితోనే విజయం ఉంటుంది. ఆర్ధిక నష్టం సంభవించే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకు కల్యాణం జరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో సవాళ్లు ఎదురవుతాయి. సందర్భానుసారంగా నడుచుకుంటే సవాళ్ళను అధిగమించవచ్చు. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. విద్యార్థులకు ఈ వారం సవాలుగా ఉంటుంది. కష్టపడితే తప్ప ఆశించిన ఫలితం ఉండదు. చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మంచిది. భూమి, ఇల్లు కొనుగోలు వంటి నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. వైవాహిక బంధాలలో అపార్ధాలకు అవకాశం ఉంది. సన్నిహితులతో విహార యాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. కొత్త సంబంధాలు పెరుగుతాయి. ఫలితంగా, మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇది మీ సంపాదనలో పెరుగుదలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. గతం కంటే మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు వారం ప్రారంభంలో కొత్త బాధ్యతలు చేపడతారు. కొంత కఠిన శ్రమతోనే బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. స్దానచలనం సూచన ఉంది. వ్యాపారస్తులకు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్ కు మేలు చేస్తుంది. ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ఆరంభంలో అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నప్పటికినీ సమర్ధవంతంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తులు చేపట్టిన నూతన బాధ్యతలను తెలివితేటలతో సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. స్థిరాస్తి రంగం వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ధనం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం తీవ్రమయ్యే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు లాభాలను పొందుతారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ రీత్యా దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలెక్కుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.