Vijay Deverakonda VD 12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ- దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కున్న సినిమా 'VD 12' (వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈనెల 12న సినిమా టీజర్ విడుదలతోపాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్గా తెలిపారు. ఈ క్రమంలో సినిమా గురించి సోషల్ మీడియాలో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పనిచేశారని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే?
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే దీని తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ అందించారట. ఆయన వాయిస్‌తోనే సినిమా ప్రారంభం అవుతుందట. అలాగే హిందీలో రణ్‌బీర్ కపూర్, తమిళ్ వెర్షన్లో సూర్య కూడా వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తోంది. అయితే వీళ్ల వాయిస్ కేవలం టీజర్‌కే పరిమితమా? లేదా సినిమా మొత్తం ఉంటుందా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ లెక్కన విజయ్ కోసం మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు సినిమాలో భాగం అయ్యారన్నమాట!
ఇక సినిమా విషయానికొస్తే, సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండను పవర్‌ఫుల్‌గా చూపించనున్నారని మూవీటీమ్ చెబుతోంది. ఇటీవల కేరళలో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. కాగా, యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్య్టూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
The silent CROWN
— Sithara Entertainments (@SitharaEnts) February 7, 2025
Awaits the KING ❤️🔥#VD12 TITLE & TEASER - 12th February 💥💥@TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/RP8H7YFlMt
విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల్లో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూడా ఒకటి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రాయలసీమ నేపథ్యంలో 1854 - 1878 మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందనుంది. ఇందులో విజయ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.
అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్
VD 12 షూటింగ్లో ఏనుగుల కొట్లాట - స్పాట్ నుంచి గజరాజు జంప్! - Vijay Devarakonda VD12