Rachin Ravindra injured : న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా ఓ క్యాచ్ అందుకునే క్రమంలో బంతి అతడి తలకు బలంగా తగిలింది. దీంతో రచిన్‌కు తీవ్ర రక్త స్రావం జరిగింది. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రచిన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇదీ జరిగింది
ట్రై సిరీస్‌లో భాగంగా శనివారం పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పాక్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్ మూడో బంతిని పాకిస్థాన్ బ్యాటర్ కుష్దిల్ షా స్క్వేర్ లెగ్ దిశగా స్పీప్ షాట్ కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్‌కు బంతి ఈజీ క్యాచ్‌గా వెళ్లింది. కానీ, బంతిని అంచనా వేయడంలో విఫలమైన రచిన్ క్యాచ్ పట్టుకోలేదు.
దీంతో అది నేరుగా అతని నుదిటిపై బలంగా తాకింది. వెంటనే రచిన్ కింద పడిపోయాడు. రక్త స్రావం జరిగింది. ఒక్కసారిగా స్టేడియం నిశబ్దంగా మారింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రక్త స్రావం ఆపే ప్రయత్నం చేశారు. స్ట్రెచర్ తెప్పించినా, రచిన్ స్వయంగా నడుచుకుంటూ మైదానం వీడాడు. ఈ ఘటనతో ప్రేక్షకులు అంతా ఆందోళనకు గురయ్యారు. అతడు తొందరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలాగే తాజా ఘటన ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తు చేసిందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే అతడి గాయంపై అప్డేట్ రావాల్సి ఉంది.
Get well soon, Rachin Ravindra 🤞
— Johns. (@CricCrazyJohns) February 8, 2025
- Scary scenes at Lahore for all cricket fans. pic.twitter.com/uERdaUuWHb
కివీస్‌కు పెద్ద దెబ్బ
తాజా మ్యాచ్‌లో రచిన్‌కు గాయం పెద్దదిగా కనిపిస్తోంది. ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట రచిన్ గాయపడడం న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ పడినట్లే!
ఇక మ్యాచ్ విషయానికొస్తే, న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లక 330 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (106 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఛేదనలో పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఫకర్ జమాన్(84 పరుగులు) రాణించాడు.
న్యూజిలాండ్ సిరీస్‌లో రచిన్ అజేయ శతకం - 12 ఏళ్లలో తొలి కివీస్ ప్లేయర్‌గా రికార్డు