Horoscope Today February 9th 2025 : 2025 ఫిబ్రవరి 9వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు ఎలాంటి కొత్త పనిని ఆరంభించండి. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి వ్యాపారాలలో గట్టి పోటీ ఎదుర్కోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. దూర ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలతో అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. వృత్తి పరంగా మంచి అవకాశాలు వెతికి పట్టుకోవాలి. ఆర్ధిక పరమైన విధానంలో స్పష్టత ఉండాలి. కొత్త వ్యవహారాలేవీ మొదలు పెట్టవద్దు. ముఖ్యమైన దరఖాస్తులపై మీద సంతకాలు గానీ, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం చేయకండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సర్వత్రా అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. పెట్టుబడుల మీద మంచి లాభాలు గడిస్తారు. సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మోసానికి గురికాకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. కొన్ని సంఘటనలు మానసిక అశాంతి కలిగిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఆర్థికంగా నష్టాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ప్రసంశలు అందుకుంటారు. స్నేహితుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికవృద్ధి ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరుల సహకారంతో కీలక వ్యహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకూల సమయం నడుస్తోంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. వృత్తిపరమైన అభివృద్ధి పదోన్నతి ద్వారా, ఆదాయం వృద్ది చెందుతుంది. అన్ని విషయాల్లో తారాబలం చాలా అనుకూలంగా ఉంది. పితృ సంబంధంగా లబ్ధి పొందవచ్చు. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ధననష్టం సంభవించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ కలహాలు తీవ్రంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆచి తూచి నడుచుకోవాలి. కొత్త పనులు వాయిదా వెయ్యండి. ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు. అదనపు పెట్టుబడులు, వృధా ఖర్చులు లేకుండా చూసుకోండి. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పనుల్లో సమయపాలన అవసరం. ఆర్ధిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్ని విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంతానం ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పారాయణ శుభప్రదం.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఏర్పడినా బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు ఆటు పోట్లూ లేకుండా సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగంలో పనిభారం పెరగవచ్చు. ఒక సంఘటన మనోవిచారం కలిగిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శ్రీరామ రక్షా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో తీవ్రమైన జాప్యం చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాలు వాయిదా వేయండి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం.
మీనం (Pisces) : మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని శుభవార్తలు మనః సౌఖ్యాన్ని ఇస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులలో విజయం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విష్ణువు ఆలయ సందర్శన శుభకరం.