Bumrah Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. అతడి వెన్ను నొప్పికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ బాగానే ఉన్ననప్పటికీ, పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం కష్టమేనన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. అయితే దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే అనంతరం మాట్లాడాడు.
'బుమ్రా లాంటి పేసర్ జట్టులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. మేం కూడా అతడు ఆడతాడనే ఆశాభావంతోనే ఉన్నాం. కానీ, అన్నీ మన చేతుల్లో లేవు కదా. అతడు వరల్డ్‌క్లాస్ ప్లేయర్. భవిష్యత్తులో బుమ్రా మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. అందుకే అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం'
'దీనివల్ల యువ పేసర్లకు మంచి అవకాశం దొరికింది. హర్షిత్, అర్ష్‌దీప్ సింగ్ నుంచి నాణ్యమైన ప్రదర్శన వస్తుందని భావిస్తున్నా. దేశం కోసం తమవంతు బాధ్యత తీసుకోవాలి. ఐసీసీ టోర్నీలో ఆడే అవకాశం రావడం సులువేం కాదు. ఇంగ్లండ్‌పై హర్షిత్ అద్భుతంగా ఆడాడు. కీలకమైన వికెట్లు తీసి సత్తా చాటాడు. షమీ వంటి సీనియర్ పేసర్ జట్టులో ఉన్నాడు. కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తాడు. ఇది జట్టుకు అదనపు ప్రయోజనం' అని గంభీర్ పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా బుమ్రా దూరమైన స్థానంలో ట్రావెల్ రిజర్వ్‌గా ఉన్న హర్షిత్ రాణాకు స్క్వాడ్‌లో అవకాశం లభించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది. ఇక మహ్మద్ సిరాజ్, శివమ్ దూబె, యశస్విని నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌గా ఎంపిక చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్త్
A look at #TeamIndia's updated squad for ICC Champions Trophy 2025 🙌#ChampionsTrophy pic.twitter.com/FchaclveBL
— BCCI (@BCCI) February 12, 2025
బుమ్రా మెడికల్ రిపోర్ట్ ఓకే- కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు- ఎందుకంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్ - జైస్వాల్ ప్లేస్‌లో మరో స్టార్ - తుది జట్టులో కీలక మార్పులు