ETV Bharat / state

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం - ఒకే రోజు రూ.56,300 కోట్లు - HUGE INVESTMENTS FOR TELANGANA

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం - రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ

Huge investments for Telangana
Huge Investments In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 9:09 AM IST

Huge investments for Telangana : ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. గత దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులను ఇప్పటికే అధిగమించాయి. ఇప్పటికే సుమారు రూ.62వేల కోట్ల విలువైన ఒప్పందాలు జరగ్గా ఇవాళ మరిన్ని ఎంవోయూలు జరగనున్నాయి. బుధవారం సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల ఎస్, జేఎస్​డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రోజుల దావోస్ పర్యటన నేటితో ముగియనుంది.

తెలంగాణకు పెట్టుబడుల పంట - వేలమందికి లభించనున్న ఉపాధి అవకాశాలు (ETV Bharat)

తెలంగాణలో సన్​ పెట్రో కెమికల్స్​ భారీ పెట్టుబడులు : దావోస్ వేదిక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గతేడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుమారు రూ.40వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈ సారి ఇప్పటికే సుమారు రూ.62వేల కోట్ల వరకు వచ్చాయి. నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ చేసుకుంది. భారీ పంప్‌ స్టోరేజీ జలవిద్యుత్తు, సోలార్‌విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ములుగుజిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. వాటికి 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఆ ప్రాజెక్టుల నిర్మాణదశలోనే సుమారు 7వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దావోస్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.

గ్రీన్​ ఎనర్జీకి ప్రధాన్యమిస్తున్నాం : సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపిన తర్వాత ఎంవోయూ జరిగింది. సుస్థిర ఇంధన వృద్ధి సాధించే లక్ష్య సాధనలో ఆ ఒప్పందం మైలు రాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను సీఎం అభినందించారు. భవిష్యత్‌ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ, హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అంతా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టు ఏర్పాటు చేసి మచిలీపట్నానికి రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న కంట్రోల్ ​ఎస్​ : రూ.10వేల కోట్ల పెట్టుబడికి సంబందించి రాష్ట్రప్రభుత్వంతో కంట్రోల్‌ ఎస్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. జేఎస్​డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో రూ.800 కోట్లతో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్ డబ్యూ యూఏవీ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్-జీసీసీలకు దేశంలోనే హైదరాబాద్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జీసీసీలని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. బుధవారం దావోస్​లో నిర్వహించిన సీఐఐ, పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కొత్తక్యాంపస్ సిద్ధమైనట్లు హెసీఎల్​ టెక్నాలజీస్ తెలిపింది.

ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంది : దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌లో ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హెసీఎల్​ టెక్‌గ్లోబల్ సీఈవో, ఎండీ విజయకుమార్‌తో చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్‌శ్వాబ్‌తో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు ఉన్న మౌలిక సదుపాయాలపై ఆయనకి వివరించగా పారిశ్రామిక విప్లవం, సాంకేతిక మార్పుల్లో తెలంగాణ చూపిస్తున్న నైపుణ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుందని క్లాస్‌శ్వాబ్‌ ప్రశంసించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. వారంరోజులుగా సింగపూర్, స్విట్జర్లాంట్ లో సీఎం బృందం పర్యటిస్తున్న వారు దావోస్‌లో పర్యటన ముగించుకొని మధ్యాహ్నం బయలుదేరనున్నారు. జూరిచ్ విమానాశ్రయం ఈ రాత్రి దుబాయ్ చేరుకొని అక్కడి నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్ రానున్నారు.

తెలంగాణలో భారీ పెట్టుబడులు - రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ ఎంవోయూ

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - రూ.15వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న మేఘా ఇంజినీరింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.