కానిస్టేబుల్ మంచి మనసు​.. కేసు పెట్టేందుకు వచ్చిన వృద్ధుడికి కొత్త బూట్లు - వృద్ధుడికి కొత్త బూట్లు కొనిచ్చిన పోలీస్ వీడియో​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2023, 12:49 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్ కమిషనరేట్​లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ 80 ఏళ్ల వృద్ధుడికి కొత్త బూట్లు కొనిచ్చాడో పోలీస్​. అతడి చెప్పుల స్థితి చూసి చలించిన కానిస్టేబుల్.. వెంటనే వెళ్లి కొత్త బూట్లు కొని వృద్ధుడికి తొడిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.  

ఇదీ జరిగింది..
సాఢ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రాజ్​బహదూర్​ (80) అనే వృద్ధుడు.. కొద్ది రోజుల క్రితం కాన్పుర్​ పోలీస్​ కమిషనరేట్​కు వెళ్లి తన ఇంటిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. అయితే, అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్​ నిశాంత్​ తోమర్..​ ఆ వృద్ధుడి చెప్పుల పరిస్థితి చూసి చలించిపోయాడు. అతడికి కొత్త బూట్లను కొనివ్వాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆ వృద్ధుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటి విషయమై మళ్లీ శుక్రవారం కమిషనరేట్​కు వెళ్లాడు రాజ్​బహదూర్​. ఈసారి వృద్ధుడిని చూసిన నిశాంత్​.. వెంటనే సమీపంలోని దుకాణంలో కొత్త బూట్లు కొనుగోలు చేశాడు. అనంతరం వృద్ధుడికి బూట్లు తొడిగాడు. తన తండ్రి అనుకుని ఇలా చేశానని నిశాంత్​ తెలిపాడు. ఆ తర్వాత నిశాంత్​ను వృద్ధుడు ఆశీర్వదించి.. ఇలాగే ప్రజలకు సహాయం చేయాలని, పోలీసులు చెడుగా ప్రవర్తిస్తారనే అపోహను తొలగించాలని సూచించాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.