Ind vs Pak 2025 : దేశవ్యాప్తంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. యావత్ ప్రపంచం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కోసం భారీ ఎత్తున ప్రేక్షకులు స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు.
మహాకుంభ్‌లో ప్రత్యేక పూజలు : ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నది ఒడ్డున టీమ్ఇండియా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గాలని ఆశించారు. ఇక వారణాసి, బిహార్‌లో పలువురు ఫ్యాన్స్ ప్రత్యేక హోమం నిర్వహించారు. క్రికెటర్ల ఫొటోలు, జాతీయ జెండాలు పట్టుకొని 'జై హింద్' అంటూ నినాదాలు చేశారు.
బుల్లి క్రికెట్ ఫ్యాన్స్ విషెస్: వారణాసిలో చిన్నారులు టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'జీతేగా బై జీతేగా ఇండియా జీతేగా. ఆల్ ది బెస్ట్ ఇండియా అంటూ' బుజ్జి క్రికెట్ ఫ్యాన్స్ హుషారుగా టీమ్ఇండియాను విష్ చేశారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని అకాంక్షించారు. 'రోహిత్', 'విరాట్' అంటూ నినాదాలు చేశారు.
జనాన్ల శుభాకాంక్షలు : హై వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ఇండియాకు భారత ఆర్మీ జవాన్లు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'ఇండియా జీతేగా', 'చక్ దే ఇండియా' అంటూ హుషారుగా ఛీర్స్ చెప్పారు.