హాంకాంగ్ బందీలకు మద్దతుగా తైవాన్‌లో నిరసనలు - protest videos
🎬 Watch Now: Feature Video
తైవాన్ రాజధాని తైపీలో నిరసనలు చెలరేగాయి. నలుపు రంగు వస్త్రాలు, ముఖానికి మాస్క్ ధరించిన వందలాది మంది నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. 'గ్లోరీ టు హాంకాంగ్' నినాదంతో నగరమంతా ర్యాలీ నిర్వహించారు. చైనా నిర్బంధించిన 12 మంది హాంకాంగ్ పౌరులను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీధులన్నీ నిరసనకారుల నినాదాలతో హోరెత్తాయి. బోటులో అక్రమంగా తైవాన్‌కు ప్రయాణిస్తున్నారన్న ఆరోపణలతో ఈ 12 మందిని ఆగస్టులో చైనా అధికారులు బందించారు.