'టిక్‌టాక్' చేస్తూ వెన్ను విరగ్గొట్టుకొన్న యువకుడు - వీడియో
🎬 Watch Now: Feature Video
కర్ణాటక తుమకూరు జిల్లా చిక్కనాయకహల్లిలో టిక్‌టాక్ కోసం ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. తన స్నేహితుడు వీడియో రికార్డు చేస్తుండగా వెనుకకు పల్టీ కొడదామని ప్రయత్నించాడు. అయితే అనూహ్యంగా తల బలంగా నేలను తాకింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా...వెన్నెముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. టిక్‌టాక్ కోసం ఇలాంటి విన్యాసాలకు పోవద్దని వైద్యులు సూచించారు.
Last Updated : Jun 18, 2019, 10:15 PM IST