LIVE : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - CHERLAPALLY TERMINAL OPENING LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-01-2025/640-480-23264231-thumbnail-16x9-terminal-inauguration-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 6, 2025, 10:30 AM IST
|Updated : Jan 6, 2025, 1:37 PM IST
Cherlapally Terminal Inauguration Live : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా ప్రారభించారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. సోమవారం నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్‌లో కేఫీటేరియా, రెస్టారంట్, రెస్ట్‌రూమ్ సౌకర్యాలు ఉన్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. దిల్లీ, చెన్నై, విశాఖపట్టణం, కోల్‌కతా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
Last Updated : Jan 6, 2025, 1:37 PM IST