Bus Fell Into Gorge In Kerala : కేరళ ఇడుక్కిలో ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతిచెందారు. 23మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా సోమవారం ఉదయం 6.15 గంటలకు ఇడుక్కిలోని పుల్లుపార వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనేఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అరుణ్ హరి, రమా మోహన్, బిందు నారాయణన్, సంగీత్