ETV Bharat / offbeat

వాషింగ్​ మెషీన్​లో దుస్తులు మాత్రమే ఉతుకుతున్నారా? - వీటినీ వాష్​ చేయొచ్చంటున్న నిపుణులు! - THINGS TO CLEAN IN WASHING MACHINE

-వాషింగ్​ మెషీన్​లో బట్టలతో పాటు వీటిని ఉతకచ్చట -కానీ పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

What are the Things to Clean in Washing Machine
What are the Things to Clean in Washing Machine (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 10:29 AM IST

What are the Things to Clean in Washing Machine: ప్రస్తుత రోజుల్లో నిత్యావసర వస్తువుల లిస్ట్​లో వాషింగ్​ మెషీన్​ కూడా చేరింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారు. రోజువారి బట్టలు, దుప్పట్లు, డోర్​మ్యాట్స్​ ఇలా అన్నింటిని ఉతికేస్తున్నారు. అయితే, వాషింగ్​ మెషీన్లో కేవలం బట్టలు మాత్రమే కాకుండా పలు వస్తువులను సైతం ఈజీగా ఉతకచ్చని అంటున్నారు నిపుణులు. మరి ఆ వస్తువులు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం.

ఈ వస్తువులు వేయొచ్చు:

  • చిన్నారులు ఆడుకునే సాఫ్ట్‌ టాయ్స్‌, క్లాత్‌ లేదా ఫర్‌ మెటీరియల్‌తో తయారు చేసిన బొమ్మలపై దుమ్ము, ధూళి కణాలు చేరి మురికిగా కనిపిస్తుంటాయి. వీటిని చేతులతో క్లీన్​ చేయాలంటే కొద్దిగా కష్టమే. అలాంటి సమయంలో వాటిని మెష్‌ బ్యాగ్‌లో వేసి ‘మెషీన్​లో క్విక్‌ వాష్‌’ సెలెక్ట్​ చేసి రన్​ చేస్తే కొత్త వాటిలా మారిపోతాయని వివరిస్తున్నారు.
  • వంటగదిలో ఉపయోగించే స్పాంజ్‌లు, సిలికాన్‌ ట్రివెట్స్‌ (వేడి గిన్నెల అడుగున వేసే మ్యాట్‌), వేడి గిన్నెలు దింపడానికి ఉపయోగించే సిలికాన్‌ గ్లౌజులు వంటివన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేసి శుభ్రం చేసుకోవచ్చంటున్నారు. అయితే వీటి కోసం మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు వచ్చేలా ముందుగా మెషీన్‌లో ఆప్షన్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.
  • నేటి రోజుల్లో స్నానం చేయడం కోసం లూఫా స్పాంజ్‌లను ఉపయోగించడం సర్వసాధారణమైంది. వీటిని వాడే క్రమంలో చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు ఇందులోకి చేరతాయి. కాబట్టి వీటినీ తరచూ శుభ్రం చేయాల్సిందే. అందుకోసం వీటిని మెష్‌ బ్యాగ్‌లో ఉంచి వాషింగ్​ మెషీన్‌లో వేసి వాష్​ చేస్తే మురికి వదులుతుందని చెబుతున్నారు.
  • హెయిర్‌ టైస్‌, రబ్బర్‌ బ్యాండ్స్‌, హెడ్‌ బ్యాండ్స్‌ వంటి హెయిర్‌ యాక్సెసరీస్‌ తొందరగా జిడ్డు పడుతుంటాయి. అయితే వీటిని కూడా మెష్​బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వాష్​ చేయొచ్చని చెబుతున్నారు.
  • ప్రస్తుతం ఎటువంటి దుస్తులు ధరించినా బెల్టు పెట్టుకోవడం ఫ్యాషనైపోయింది. అయితే వీటిని వాష్​ చేయాలనుకున్నప్పుడు మెష్‌ బ్యాగ్‌లో వేసి మెషీన్‌లో వేస్తే సరి అంటున్నారు. తద్వారా వాటికి ఉండే మెటల్‌ హార్డ్‌వేర్‌ పాడవకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  • గట్టి వస్తువులు, డెలికేట్​ వస్తువుల్ని జిప్‌లాక్‌ ఉన్న మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేయాలని, తద్వారా అటు అవి, ఇటు వాషింగ్‌ మెషీన్‌ డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు.
  • చాలా వరకు చల్లటి లేదా గోరువెచ్చటి నీటిని ఉపయోగించడమే మంచిది. అలాగే ‘క్విక్‌ వాష్‌’ ఆప్షన్‌ మెషీన్​లో వేసి వస్తువుల వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందంటున్నారు.
  • అన్ని వస్తువులకు గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌/లిక్విడ్‌ ఉపయోగించడం ఉత్తమమని, మరీ సున్నితమైన వస్తువులైతే క్యాస్టైల్‌ సోప్‌ లిక్విడ్‌ని వాడచ్చని సూచిస్తున్నారు.
  • ఈ వస్తువులను ఎండలో ఆరబెట్టడం వల్ల వాటిలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములు తొలగిపోయి మరింత శుభ్రపడతాయని చెబుతున్నారు.
  • వీటన్నింటితో పాటు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆయా వస్తువుల్ని వాషింగ్​ మెషీన్​లో వేసే ముందు వాటి లేబుల్‌ని పరిశీలించడం మంచిదంటున్నారు.
  • ఉపయోగించే మెషీన్​లో ఆయా వస్తువులను శుభ్రం చేసే ఫీచర్లు ఉన్నాయో, లేదో ముందే చూసుకోవడం మర్చిపోవద్దని, తద్వారా ఆయా వస్తువులు, వాషర్‌ పాడవకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

వాషింగ్ మెషీన్​లో స్వెట్టర్లు, మఫ్లర్లు వేస్తున్నారా? - ఇలా చేయకపోతే త్వరగా దెబ్బతింటాయట!

మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్​ రంగు పోతోందా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుపు తగ్గదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.