ETV Bharat / offbeat

పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పని లేదు - ఈ "పౌడర్" ఉంటే చాలు అప్పటికప్పుడు మృదువైన ఇడ్లీలు! - INSTANT IDLI MIX RECIPE

ఇలా ఇడ్లీ మిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకోండి - తినాలనిపించినప్పుడు నిమిషాల్లో రెడీ!

HOW TO MAKE INSTANT IDLI MIX
Instant Idli Mix Making Process (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 23 hours ago

Instant Idli Mix Making Process : చాలా మంది ఇళ్లలో మార్నింగ్​ టిఫెన్​గా ఇడ్లీ ఉంటుంది. టేస్ట్​తోపాటు తేలిగ్గా అరుగుతూ, ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో బ్రేక్​ఫాస్ట్​గా ఇడ్లీని తీసుకుంటుంటారు ఎక్కువ మంది. అయితే, సాధారణంగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టి, మర్నాడు ఉదయం రుబ్బి, దానికి రవ్వ యాడ్ చేసి కొన్ని గంటలు పులియబెట్టాలి. అప్పుడు ఇడ్లీలు తయారు చేసుకోవాలి. ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్.

కానీ, మీకు తెలుసా? పప్పు నానబెట్టడం, రుబ్బడం లాంటి హంగామా లేకుండా ఎప్పటికప్పుడు చాలా ఈజీగా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా సమయం దొరికినప్పుడు ఇలా "ఇడ్లీ మిక్స్ పౌడర్" ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలు. మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నిమిషాల్లో చాలా సులువుగా ఇడ్లీలు చేసుకోవచ్చు. మరి, ఇడ్లీ మిక్స్​ పౌడర్​ని ఇంట్లోనే తయారుచేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 4 కప్పులు
  • మినప్పప్పు - 2 కప్పులు
  • అటుకులు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్ సోడా - అర చెంచా

చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని మినప్పప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆపై దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • అనంతరం అదే కడాయిలో అటుకులను కొద్దిగా వేయించుకొని పక్కకు తీసి చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకున్న మినప్పప్పు, అటుకులను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఒకసారి జల్లించి, మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే చాలా మెత్తగా ఉంటుంది.
  • ఆ తర్వాత ఒక మిక్సింగ్​ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న మినప పిండి మిశ్రమం, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది.
  • ఇక మీరు ఎప్పుడు ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే అప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్​లో రెండు కప్పుల ఇడ్లీ మిక్స్, ఒక కప్పు వాటర్, ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని ఒకటికి నాలుగుసార్లు చక్కగా కలుపుకుంటే మెత్తటి ఇడ్లీ పిండి రెడీ అవుతుంది.
  • అప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, తగినంత పిండి వేసి ఇడ్లీ పాత్రలో సుమారు 12 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్​స్టంట్ ఇడ్లీలు మీ ముందు ఉంటాయి.

ఇడ్లీ పిండితో రుచికరమైన "పునుగులు" - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.