MG Windsor EV Price Increase: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ JSW MG మోటార్ ఇండియా తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సార్ ఈవీ ధరల్ని పెంచింది. దీని అన్ని వేరియంట్ల ధరను రూ.50,000 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కంపెనీ ఈ కారు లాంఛ్ సమయంలోనే దీని ప్రారంభ ధరను కేవలం 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని తెలిపింది. ఈ క్రమంలోనే 2024 డిసెంబర్ నాటికి విండ్సార్ ఈవీ విక్రయాలు 10వేల యూనిట్ల మైలురాయిని చేరుకోవడంతో అనుకున్నట్లుగానే కంపెనీ దీని అన్ని వేరియంట్ల ధరలను సవరించింది.
దీంతోపాటు కంపెనీ విండ్సార్ ఈవీ కొనుగోలు చేసిన కస్టమర్లకు అందింస్తున్న ఫ్రీ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా నిలిపివేసింది. ఇప్పటివరకు కాంప్లిమెంటరీ ఆఫర్ కింద ఎంజీ ఇ-హబ్ యాప్‌ను ఉపయోగించి ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగదారులకు ఉచితంగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఇక నుంచి ఆ వెసులుబాటు ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
అంతేకాక ఈ కారు కొనుగోలు చేసిన ఫస్ట్ ఓనర్‌కు ఈవీ బ్యాటరీపై లైఫ్‌టైమ్ ఫ్రీ వారెంటీ సదుపాయం ఉండగా.. వారి నుంచి కారు కొనుగోలు చేసేవారికి 8 ఏళ్ల పాటు లేదా 1,60,000 కిలోమీటర్ల వరకు మాత్రమే వారెంటీని పరిమితం చేసింది.
సవరించిన తర్వాత ధరలు ఇలా!: ఈ కొత్త ధరల సవరణ అనంతరం విండ్సార్ బేసిక్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఇక దీని మిడ్ లెవల్ ధర రూ.14.99 లక్షలకు చేరుకోగా టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా ఉంది.
విండ్సార్ ఈవీ స్పెసిఫికేషన్లు: ఈ ఎంజీ విండ్సార్ ఈవీ కారు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇందులో 38 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 134bhp పవర్, 200Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 331 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాక ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.
50MP కెమెరా, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో మోటో జీ05- కేవలం రూ.6,999లకే!
శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్- గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో
సిట్రోయెన్ బసాల్ట్ SUV ధర పెంపు- గరిష్టంగా రూ.28,000!- ఇప్పుడు దీని రేటెంతంటే?
ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్- ఈసారి ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయో తెలుసా?