President Murmu at Maha kumbh 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ఉదయం త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
#WATCH | Prayagraj, UP: President Droupadi Murmu offers prayers after taking a holy dip at Triveni Sangam during the ongoing Maha Kumbh Mela. pic.twitter.com/xLtUt27U66
— ANI (@ANI) February 10, 2025
ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు. మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని, పుణ్యస్నానం ఆచరించి, పూజలు చేశారు.
" governor of uttar pradesh smt anandiben patel and chief minister yogi adityanath received president droupadi murmu on her arrival at prayagraj," posts (@rashtrapatibhvn). pic.twitter.com/9Rxyd0kvZt
— Press Trust of India (@PTI_News) February 10, 2025
#WATCH | Prayagraj, UP: President Droupadi Murmu, Uttar Pradesh Governor Anandiben Patel, and UP CM Yogi Adityanath arrive at Triveni Sangam.
— ANI (@ANI) February 10, 2025
President Droupadi Murmu will soon take a holy dip at Sangam pic.twitter.com/WYepcGDUiy
సోమవారం ఉదయమే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మహా కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానం చేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.
Uttarakhand CM @pushkardhami takes a sacred dip at Triveni Sangam, embracing the divine confluence of faith, spirituality, and tradition.
— MahaKumbh 2025 (@MahaaKumbh) February 10, 2025
A moment of devotion, a testament to Sanatan’s eternal essence! 🚩 pic.twitter.com/MXuB081moB
144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమయ్యింది. భారత్‌తోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.