ETV Bharat / state

నేడే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం - జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ - CHERLAPALLY TERMINAL INAUGURATION

నేడే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం - దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi Will Inaugurate Cherlapally Terminal
PM Narendra Modi Will Inaugurate Cherlapally Terminal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 9:41 AM IST

PM Narendra Modi Will Inaugurate Cherlapally Terminal : ఆధునిక సాంకేతికతతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను నేడు ప్రారంభించనున్నారు. విమానాశ్రయాన్ని తలపించే తరహాలో చర్లపల్లి నిర్మాణం చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమం ద్వారా చర్లపల్లి టెర్మినల్​ను జాతికి అంకితం చేయనున్నారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొననున్నారు. నేటి నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతుంది.

విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్​ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్​తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్​లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్‌ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్‌ హాళ్లు, హైక్లాస్‌ వెయిటింగ్‌ ప్రదేశం, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్​లో కేఫీటేరియా, రెస్టారెంట్‌, రెస్ట్‌ రూమ్‌ సౌకర్యాలు ఉన్నాయి.

నేడే చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం - హాజరుకానున్న కేంద్ర మంత్రులు (ETV Bharat)

విమానాశ్రయాన్ని తలపించే రీతిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ - త్వరలో పూర్తికానున్న నిర్మాణం - Cherlapalli Terminal Railway

చర్లపల్లి రైల్వే టెర్మినల్​లో ఇప్పటికే రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. వాటికి అదనంగా మరో రెండు నూతన ఎఫ్ఓబీలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి 12 మీటర్ల ఎఫ్ఓబీ, మరొకటి 6 మీటర్ల ఎఫ్ఓబీని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో చర్లపల్లిలో 5 వరకు ప్లాట్ ఫారంలు ఉండేవి. మరో నాలుగు ప్లాట్ ఫారమ్​లను జోడించి వాటిని 9కి పెంచారు. వీటిలో రెండు ప్లాట్ ఫారమ్​లను డెడికేటెడ్​గా ఎంఎంటీఎస్​లకు కేటాయించారు.

తగ్గనున్న ప్రయాణికుల భారం : చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. దిల్లీ, చెన్నై, విశాఖపట్టణం, కోల్​కతా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రావడంతో నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది.

శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.