కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు - Gujarat
🎬 Watch Now: Feature Video
కరోనా మహమ్మారిపై పోరాటంలో యావత్ భారత దేశం ఒక్కతాటిపై ఉందని రుజువు చేశారు కోట్లాది మంది ప్రజలు. ప్రధాని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సరిగ్గా నిన్న రాత్రి 9 గంటలకు తమ ఇళ్లలో లైట్లు ఆపి.. కొవ్వొత్తులు, దివ్వెలు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు నగరాలు దీప కాంతుల్లో ఎంతో సుందరంగా కనిపించాయి. చీకట్లో మిణుగురులు వలే మెరిశాయి. దిల్లీ, ముంబయి, గుజరాత్లోని వడోదర నగరాల్లోని వీధులు దీప కాంతులీనుతూ కనువిందు చేశాయి.