ETV Bharat / offbeat

అసలైన "కొబ్బరి చట్నీ" చేసే పద్ధతి ఇదీ - వేళ్లు నాకేస్తారంతే! - KOBBARI PACHADI RECIPE

- రొటీన్ పచ్చడిని మించిన టేస్ట్ - అన్ని టిఫెన్స్​లోకి అద్భుతమైన కాంబినేషన్!

How to MAke Kobbari Pachadi
Kobbari Pachadi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2025, 11:33 AM IST

Kobbari Pachadi Recipe in Telugu : ఎక్కువ మంది మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీలలోకి పల్లీ చట్నీతో పాటు కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, టేస్ట్​లో ఏదో మిస్​ అయిందని, సరిగా కుదరలేదని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అలాంటి వారు ఈ పద్ధతిలో ఒకసారి "కొబ్బరి పచ్చడి" చేసి చూడండి. పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా జబర్దస్తీ టేస్ట్​తో అదుర్స్ అనిపిస్తోంది. ఎంతలా అంటే టిఫెన్​లో తినకుండా కేవలం పచ్చడినే నాకేస్తారు! అన్ని టిఫెన్స్​లోకి ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చి కొబ్బరి ముక్కలు - 1 చిన్న కప్పు
  • పచ్చిమిర్చి - 6
  • ఎండుమిర్చి - 2
  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • ఉల్లిపాయ - 1(చిన్న సైజ్​ది)
  • పుట్నాల పప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - 10
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - కొద్దిగా

తాలింపు కోసం :

  • నూనె - 1 టేబుల్​స్పూన్
  • పోపు దినుసులు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 3
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - చిటికెడు

ఇదొక్కటి వేసి "పల్లీ చట్నీ" చేయండి - టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్ టేస్ట్​తో అదుర్స్ అనిపిస్తుంది!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పచ్చికొబ్బరిని ఒక చిన్న కప్పు పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని వేసి లో-ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి.
  • అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చే వరకు వేపుకోవాలి.
  • ఆ విధంగా వేయించుకున్నాక పుట్నాల పప్పు యాడ్ చేసుకొని కలిపి 30 సెకన్ల పాటు వేయించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకున్న పుట్నాల పప్పు మిశ్రమం, చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఉప్పు, చింతపండు వేసుకొని మొదటగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై పచ్చిమిర్చి వేయించుకున్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసి లైట్​గా వేగనివ్వాలి. ఆపై అందులో ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో పోపుని వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "కొబ్బరి చట్నీ" రెడీ!

అప్పటికప్పుడు చేసుకునే "ఇన్​స్టంట్ పల్లీ చట్నీ" - అన్ని టిఫెన్స్​లోకి సూపర్ కాంబో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.