కంటైనర్లో మంటలు- ఇద్దరు సజీవ దహనం - జాతీయ రహదారి రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ ఉదయ్పుర్లో ఘోర ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఓ కంటైనర్లో పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఈ బొగ్గు లోడు కంటైనర్.. 3 కిలోమీటర్లకు ముందే మరో ట్రక్కును ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి.. కొద్ది దూరం ప్రయాణించాక అవి తీవ్రమయ్యాయి. ఆ సమయంలో అందులో ఉన్న డ్రైవర్, ఆపరేటర్లు మంటల్లో చిక్కుకున్నారు.