కారు డిక్కీలోని బిడ్డను చూస్తూ 3కి.మీ ప్రయాణించిన గోవు - తమిళనాడు న్యూస్
🎬 Watch Now: Feature Video
Cow followed calf: ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదని నిరూపించే సంఘటన తమిళనాడు శివగంగైలో జరిగింది. ఓ లేగదూడను రైతు కారులో పొలం నుంచి ఇంటికి తరలిస్తుండగా.. దాని తల్లి అనుసరించింది. 3 కిలోమీటర్లు బిడ్డ కోసం కారు వెనుకే ప్రయాణించింది. చివరకు రైతు ఇంటికి చేరుకున్నాక లేగదూడను అక్కున చేర్చుకుంది. కాన్పు అనంతరం ఓ రోజంతా తల్లీబిడ్డలను ఒక దగ్గరే ఉంచామని, సంప్రదాయం ప్రకారం దూడను ఇంటికి తీసుకొచ్చామని రైతు చిన్నరాజ తెలిపాడు. తన బిడ్డను ఎక్కడకో తీసుకెళ్తున్నారని తల్లి తమను అనుసరించిందని చెప్పాడు.