Gold Rate Today January 3rd, 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,100 ఉండగా, శుక్రవారం నాటికి రూ.840 పెరిగి రూ.79,940కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.89,300 ఉండగా, శుక్రవారం నాటికి రూ.750 పెరిగి రూ.90,050కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 3rd, 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Vijayawada January 3rd, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 3rd, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
- Gold Price In Proddatur January 3rd, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,940గా ఉంది. కిలో వెండి ధర రూ.90,050గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 3rd, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,633 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 29 డాలర్లు పెరిగి 2,662 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.61 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 3rd, 2025 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడం, బ్యాంక్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ఉండటమే ప్రధాన కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 496 పాయింట్లు నష్టపోయి 79,466 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 24,084 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ
- నష్టాల్లో ఉన్న షేర్లు : టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో
రూపాయి విలువ
Rupee Value January 3rd 2025 : డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.78 వద్ద కొనసాగుతోంది.
ముడిచమురు ధరలు
Crude Oil Prices January 3rd, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.30 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 76.16 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 3rd, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.