ETV Bharat / state

గుండె దడగా అనిపిస్తుందా? - ఇవే కారణాలట! - చికిత్స తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదమట!! - AFFORDABLE CARDIAC CARE IN NIMS

పెరుగుతున్న గుండె దడ రోగుల సంఖ్య - ఆర్​ఎఫ్​ఏ చికిత్స అందిస్తున్న నిమ్స్​ - అతి తక్కువ ధరలకే చికిత్స

Affordable Cardiac Care in NIMS Hospital
Affordable Cardiac Care in NIMS Hospital (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 11:59 AM IST

Affordable Cardiac Care in NIMS Hospital : గుండె దడ బెంబేలెత్తిస్తోంది. ఎక్కువగా ఆల్కహాల్​, కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం, గురక సమస్య ఉన్నవారు, పొగ తాగడంతో పాటు జీవనశైలిలో మార్పులు, పుట్టుకతోనే గుండెలో లోపాల కారణంగా అధిక శాతం మంది దడతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఒక్క హైదరాబాద్​ నిమ్స్​లోనే గుండె దడకు సంబంధించి 109 వరకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లెషన్​ (ఆర్​ఎఫ్​ఏ) శస్త్రచికిత్సలు చేసినట్లు ఆసుపత్రి సీనియర్ ప్రొ.డా.ఓరుగంటి సాయి సతీష్ తెలిపారు. గతేడాది 100 సర్జరీలు చేసిన సందర్భంగా శనివారం నిమ్స్​ ఆసుపత్రిలో ఇతర వైద్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, ఎక్కువ మంది సుప్రవెంట్రిక్యులర్ టకీకార్డియా రకం గుండె దడ బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతి వెయ్యి మందిలో 3 నుంచి 5 మంది గుండె దడ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో 70 శాతం మంది 15 నుంచి 45 ఏళ్ల మధ్య వారున్నారని తెలిపారు.

గుండెలో నాలుగు గదులుంటాయని, కింద కుడి గది వైపు నుంచి ఊపిరితిత్తులకు, ఎడమ వైపు నుంచి శరీర భాగలకు రక్తం సరఫరా అవుతుందని డాక్టర్ సాయి సతీష్​ వివరించారు. ఈ ప్రక్రియ కోసం గుండె కండరాలు సంకోచ, వ్యాకోచం చెందాలని అందుకు విద్యుత్తు ప్రసరణ శక్తి అవసరమన్నారు. ఇది గుండె కుడి వైపునకు ఉన్న సైనస్​ నోడ్​ అనే ప్రాంతం నుంచి ఒక నిర్ణీత మార్గంలోనే హృదయ కండరాలకు చేరుతుందని, అలా గుండె కొట్టుకుంటుందని తెలిపారు.

రాష్ట్రంలో పెరిగిపోతున్న గుండె సమస్యలు! - చలితో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

"గుండెలో దడ పెరగడానికి కారణం కొన్నిసార్లు అసాధారణంగా విద్యుత్తు ప్రసరణ జరిగితే అది ఒక రకంగా షార్ట్‌ సర్క్యూట్‌కు దారి తీయడం వల్ల జరుగుతోంది. మనిషిలో నిమిషానికి 80 సార్లు గుండె కొట్టుకుంటుంది. అదే గుండె దడ సమస్య ఉన్న వారిలో కొన్నిసార్లు గుండె 150-200 ఉంటుంది. గుండె పంపింగ్‌ సామర్థ్యం కోల్పోతుంది. శరీర భాగాలకు రక్తసరఫరా సరైన పద్ధతిలో జరగదు. ఇలా జరిగిన వెంటనే రక్తపోటు తగ్గిపోయి ఆయాసం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం తదితర లక్షణాలు కనిపిస్తాయి." - డా.సాయి సతీష్‌

దాదాపు ఉచితంగానే : గుండె దడ సమస్యతో బాధ పడుతున్న వారికి ఆర్​ఎఫ్​ఏ ద్వారా నిమ్స్​లో చికిత్స ఇస్తున్నట్లు డా.సాయి సతీష్ తెలిపారు. ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ చేసి దడ ఎక్కడ పుడుతోంది, విద్యుత్తు ప్రసరణ తీరు అంచనా వేస్తారని వివరించారు. తర్వాత మిన్స్​లో 2డీ, 3డీ ఎకో మ్యాపింగ్​ ద్వారా ఈ సర్జరీ చేస్తాం. అయితే 2డీకి రూ.50 వేలు, 3డీ మ్యాపింగ్​కు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, కానీ 90 శాతం మంది రోగులకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నిమ్స్​లో వెయ్యికి పైగా సర్జరీలు చేశామన్నారు.

'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా?

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ "వాల్​నట్స్" తినాలట - పరిశోధనలో ఆసక్తికర విషయాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.