ETV Bharat / sports

ఓపెనింగ్ అదిరింది! - తొలి ఓవర్​లోనే 16 రన్స్! - ఆ ఘనత అందుకున్న తొలి బ్యాటర్​ ఇతడే! - YASHASVI JAISWAL AUS VS IND

ఆసీస్‌పై జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్ - ఆ రికార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా ఘనత

Yashasvi Jaiswal AUS vs IND
Yashasvi Jaiswal (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 4, 2025, 12:13 PM IST

Updated : Jan 4, 2025, 12:31 PM IST

Yashasvi Jaiswal AUS vs IND : సిడ్నీ వేదికగా జరుగుతోన్న చివరి టెస్ట్​లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్​ను ఆడుతోంది. నాలుగు పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ఇండియా తొలి ఓవర్‌లోనే అదిరిపోయే ఓపెనింగ్‌ అందించింది. ఆసీస్​ క్రికెటర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో జైస్వాల్‌ నాలుగు బౌండరీలతో చెలరేగిపోయాడు. ఈ ఒక్క ఓవర్​లోనే అతడు 16 పరుగులు సాధించాడు. దీంతో టెస్టుల్లో మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్​గా జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ 22 పరుగుల వద్ద స్కాట్ బోలాండ్ బౌల్డ్‌ చేతికి చిక్కాడు.

నాలుగో భారత బ్యాటర్‌గా
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత జైస్వాల్​కు ఇదే ఫస్ట్ ఆస్ట్రేలియా టూర్​ కావడం విశేషం. పెర్త్‌ టెస్టులో నమోదు చేసిన సెంచరీతో పాటు ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు సాధించాడు ఈ కుర్రాడు. టీమ్ఇండియా తరఫున టాప్‌ స్కోరర్ కాగా, అంతకంటే ముందు ఈ లిస్ట్​లో 414* పరుగులతో ట్రావిస్ హెడ్ ఉన్నాడు. అయితే తొలి సిరీస్‌లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. ఇక మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (1977/78 సీజన్‌) 450 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ (2003/04) 464 పరుగులు, మురళీ విజయ్ (2014/15) 482 పరుగులు సాధించారు.

విరాట్ మరోసారి!
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా టూర్​లో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (6) మరోసారి విఫలమయ్యాడు. తాజాగా తన వీక్​నెస్​ను మరోసారి బయటపెట్టి ప్రత్యర్థులకు వికెట్‌ను సమర్పించాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని కదిలించి స్లిప్‌లో స్మిత్‌కు విరాట్ క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సమయంలో తీవ్ర అసహనంతో కోహ్లీ ఔటయ్యాడు. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో విరాట్ ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 27.14 సగటుతో 190 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. మిగతా మ్యాచుల్లో కనీసం హాఫ్‌ సెంచరీ మార్క్‌ను తాకకపోవడం గమనార్హం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇప్పటికే టాప్‌-4 ఆర్డర్‌ వికెట్లను కోల్పోయింది.

46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా - ఆ స్పిన్ దిగ్గజం తర్వాత మనోడిదే ఘనత!

'పారిపోవద్దు రోహిత్, ఫైట్ చెయ్'- హిట్​మ్యాన్​కు మాజీ క్రికెటర్ సూచన

Last Updated : Jan 4, 2025, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.