ETV Bharat / technology

అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లతో కియా సిరోస్- బుకింగ్స్ స్టార్ట్- కేవలం రూ.25,000 చెల్లిస్తే చాలు! - KIA SYROS SUV BOOKINGS OPEN

మార్కెట్లో కియా సిరోస్ బుకింగ్స్​ ప్రారంభం- డెలివరీలు ఎప్పటినుంచంటే?

Kia Syros Suv Bookings Open
Kia Syros Suv Bookings Open (Photo Credit- Kia)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 3, 2025, 2:28 PM IST

Kia Syros Suv Bookings Open: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ కియా తన కొత్త 'కియా సిరోస్' SUV బుకింగ్స్​ను అధికారికంగా ప్రారంభించింది. డిసెంబర్ 19న మన దేశంలో ఈ మోడల్​ను పరిచయం చేశారు. సబ్‌కాంపాక్ట్ SUV సెగ్మెంట్​లో ఇది ప్రీమియం ఎక్స్​పీరియన్స్​ను అందిస్తుంది. ప్రస్తుతం భారత్​లో కియా లైనప్​లో సోనెట్, సెల్టోస్​తో పాటు ఈ కొత్త సిరోస్ కూడా వచ్చి చేరింది.

బుకింగ్ ప్రైస్ ఎంత?: కస్టమర్లు రూ. 25,000లను చెల్లించి ఈ కొత్త కియా సిరోస్​ కారును బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్​సైట్​ లేదా మీ సమీపంలోని కియా షోరూమ్​ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇంతకీ ఈ కారు ధర ఎంత?: కంపెనీ ఈ కారు ధరను ఇంకా రివీల్ చేయలేదు. అయితే దీని ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని అంతా భావిస్తున్నారు.

డెలివరీలు ఎప్పటి నుంచి?: ఈ సబ్​కంపాక్ట్ SUV డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని సమాచారం. ఫిబ్రవరి 1, 2025న కంపెనీ దీని ధరలు వెల్లడించిన తర్వాత డెలివరీ ప్రాసెస్ జరగనుంది.

కియా సిరోస్ వేరియంట్స్: కంపెనీ ఈ కియా సిరోస్​లో ఆరు వేరియంట్లను అందించింది.

  • HTX
  • HTX+
  • HTX+ ఆప్షనల్
  • HTK
  • HTK ఆప్షనల్
  • HTK+

కలర్ ఆప్షన్స్: కారు ఎనిమిది సింగిల్-టోన్ ఎక్స్​టీరియర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ప్యాలెట్‌కు ఫ్రాస్ట్ బ్లూ అదనంగా ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ మాట్టే ఆరెంజ్ యాక్సెంట్స్​తో గ్రే డ్యూయల్-టోన్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

ఫీచర్లు: ఈ సిరోస్ ఒక ఫీచర్-రిచ్ సబ్ కాంపాక్ట్ SUV. ఇది 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్-స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆటో కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాక ఈ సైరోస్‌లో వైర్‌లెస్ ఛార్జర్, ట్విన్ USB ఛార్జింగ్ పోర్ట్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లతో పాటు స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ సెకండ్-రో సీట్లు ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-ప్యానెల్ పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.

కియా సిరోస్ సేఫ్టీ ఫీచర్లు: భద్రతా పరంగా కియా సిరోస్ లెవెల్-2 ADAS సూట్​తో వస్తుంది. ఇందులో 16 అడాప్టివ్ ఫీచర్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో పాటు మరిన్ని ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు: ఈ కొత్త కియా సిరోస్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో మొదటిది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 118bhp పవర్, 172Nm టార్క్​ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక రెండోది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది 114bhp పవర్, 250Nm టార్క్​ను అందిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అయితే డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్- సింగిల్ ఛార్జ్​తో 473కి.మీ రేంజ్- ఫస్ట్​లుక్ చూశారా?

లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్: ఈ బైక్స్ వేరే లెవల్​ బ్రో- 400cc సెగ్మెంట్లో టాప్ ఇవే!

BSNL యూజర్లకు షాకింగ్ న్యూస్!- సంక్రాంతి నుంచి ఆ సర్వీసులు బంద్!

USB-C పోర్ట్​, యాపిల్ మోడెమ్​, న్యూ డిజైన్​తో 'ఐఫోన్ SE 4'- ధర ఎంత ఉంటుందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.