ETV Bharat / sports

రష్యాకు వింబుల్డన్ షాక్.. ​ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధం - వింబుల్డన్ న్యూస్

Wimbledon bans Russia: వింబుల్డన్​లో రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. బెలారస్​పైనా ఈ నిషేధం అమలవుతుందని తెలిపింది. దీంతో మెద్వెదెవ్ సహా ప్రముఖ ఆటగాళ్లు టోర్నీకి దూరం కానున్నారు.

Wimbledon bans players from Russia
Wimbledon bans players from Russia
author img

By

Published : Apr 20, 2022, 8:53 PM IST

Wimbledon bans Russia: ఉక్రెయిన్​పై దండయాత్రకు దిగిన రష్యాకు మరో షాక్ తగిలింది. ఈ ఏడాది జరిగే వింబుల్డన్ టోర్నీలో ఆ దేశ ఆటగాళ్లు ఎవరూ పాల్గొనకుండా నిషేధం పడింది. ఈ మేరకు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది. యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్​పైనా ఈ నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. రష్యాపై బ్యాన్ ఫలితంగా.. ప్రస్తుతం ర్యాంకింగ్​లో రెండో స్థానంలో ఉన్న మెద్వెదెవ్​కు టోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అతడితో పాటు 2021 వింబుల్డన్ సీజన్​ సెమీఫైనలిస్ట్ ఆర్యానా సబలెంక(నాలుగో ర్యాంకు), ర్యాంకింగ్​లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆండ్రే రూబ్లెవ్​కు సైతం టోర్నీకి దారులు మూసుకుపోయాయి. మహిళల విభాగంలో మాజీ నెం.1 విక్టోరియా అజరెంక, 2021 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ అనస్తేషియా పవ్లియుచెంకోవా సైతం వింబుల్డన్​కు దూరం కానున్నారు. జూన్ 27 నుంచి వింబుల్డన్ టోర్నీ ప్రారంభం కానుంది.

రష్యా అథ్లెట్లపై అనేక టోర్నీలు నిషేధం విధిస్తున్నాయి. రష్యా ఫుట్‌బాల్‌ జట్లను ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌తో పాటు అన్ని అంతర్జాతీయ పోటీలు, లీగ్‌ల నుంచి ఫిఫా, యూఈఎఫ్‌ఏలు బహిష్కరించాయి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్​, హాకీ క్రీడా సమాఖ్యలు సైతం రష్యా, బెలారస్​ దేశాల ఆటగాళ్లు అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడకుండా నిషేధం విధించాయి. వచ్చే ఏడాది అంతర్జాతీయ ఐస్​ హాకీ ఫెడరేషన్ (ఐఐహెచ్​ఎఫ్​) ఆధ్వర్యంలో జరగాల్సిన ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​పై రష్యాకు ఉన్న ఆతిథ్య హక్కులూ రద్దయ్యాయి.

ఇదీ చదవండి: యథావిధిగా దిల్లీ, పంజాబ్ మ్యాచ్.. మరో గేమ్​ వేదిక మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.