ETV Bharat / state

హైడ్రా అలర్ట్ : అక్కడ ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దు : ప్రజలకు రంగనాథ్ కీలక సూచన - HYDRA KEY REFERENCE FOR PEOPLE

ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కీలక సూచన - అనుమతి లేని లే అవుట్లలో కొనుగోలు చేయొద్దని సూచించిన రంగనాథ్ - ఫార్మ్ ప్లాట్లను కొంటే తర్వాత పాట్లు తప్పవని హెచ్చరిక

RANGANATH
Hydra Alert (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 8:47 AM IST

Hydra Alert : ప్రజలు అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందిపడొద్దని హైడ్రా సూచించింది. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వాటిని కొన్న తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు అందిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలోని సర్వే నెంబర్ 50లో 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే అవుట్ వేసి అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదని పేర్కొన్నారు. జీవో నెంబర్ 131 ప్రకారం అనాథరైజ్డ్​ లే అవుట్లలోని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేసిన రంగనాథ్, నగర పరిధిలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం 10 శాతం పార్కుల కోసం, 30 శాతం రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఆ నిబంధనలను పాటించడం లేదని హైడ్రాకు అందిన ఫిర్యాదుల్లో రంగనాథ్ గుర్తించారు.

హైడ్రా తీరుపై హైకోర్టు మండిపాటు : ఇదిలా ఉండగా, ప్రభుత్వ భూమి, చెరువుల రక్షణ పేరిట హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఎక్కువగా సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతలు చేపడుతోందని పేర్కొంది. ఒకవేళ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టినా, అది రెండో శనివారం అవుతోందని, తర్వాత ఆదివారం కూల్చివేతలు చేపడుతోందని, ఇది గతంలో ఇదే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. ముత్తంగి గ్రామంలో విచారణ జరపకుండా చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ఇన్​స్పెక్టర్ రాజశేఖర్ ఈ నెల 20న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రాలపై హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై భూ మార్పిడి ప్రొసీడింగ్స్, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులతో సహా అన్ని వివరాలను సమర్పించినా కూల్చివేతలు చేపట్టారన్నారు.

ఫిర్యాదు చేసిన అసోసియేషన్‌తో పాటు పిటిషనర్‌ను పిలిచి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా కూల్చి వేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పత్రాలు సమర్పించడానికి హైడ్రా 24 గంటలు కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. ఒక కేసులో 8న నోటీసులు ఇచ్చి 9న కూల్చి వేసిందన్నారు. హైడ్రా ప్రొసీడింగ్ ప్రజలకు వ్యతిరేకంగా, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముత్తంగిలో కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా ఇన్​స్పెక్టర్ రాజశేఖర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.

మళ్లీ విరుచుకుపడ్డ హైడ్రా, ప్రకృతి రిసార్ట్స్​, కన్వెన్షన్​ నేలమట్టం - హోర్డింగ్స్​పై నజర్

చెరువుల పరిరక్షణకు హైడ్రా పిలుపు - ఈ నంబర్​కు ఫోన్​, వాట్సప్​ చేస్తే చాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.