ETV Bharat / offbeat

నాన్​వెజ్​ కంటే రుచికరంగా "జామకాయ మసాలా కర్రీ" - అన్నం, రోటీ, పులావ్​లోకి సూపర్ కాంబో! - JAMAKAYA MASALA CURRY

జామకాయలతో అద్దిరిపోయే మసాలా కర్రీ - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!

GUAVA CURRY
Jamakaya Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 7:37 AM IST

Jamakaya Masala Curry : కొంతమంది మసాలా కూరలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రోటీ, నాన్, బిర్యానీ, పులావ్​లకు మంచి కాంబినేషన్​గా నిలుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పనీర్, గుడ్డు, చికెన్, గుత్తొంకాయ, ఆలూతో మసాలా కర్రీలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఈసారి వాటికి బదులుగా కాస్త డిఫరెంట్​గా ఈ కర్రీని ట్రై చేయండి. అదే, "జామకాయ మసాలా కర్రీ". నాన్​వెజ్​ రుచులను మించిన టేస్ట్​తో ఆహా అనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది ఈ కర్రీ! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జామకాయలు - పావు కిలో
  • ఉల్లి తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • టమాటాలు - 3
  • వెల్లుల్లి - అరపాయ
  • అల్లం - అంగుళం ముక్క
  • కారం - తగినంత
  • శనగపిండి - 1 చెంచా
  • ధనియాల పొడి - 1 చెంచా
  • గరంమసాలా - 1 చెంచా
  • జీలకర్ర - 1 చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర చెంచా
  • పెరుగు - పావు కప్పు
  • బిర్యానీ ఆకులు - 2
  • దాల్చినచెక్క - అరంగుళం ముక్క
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • మెంతి ఆకుల పొడి - 1 టేబుల్ ​స్పూన్
  • ఎండుకొబ్బరి తురుము - 1 టేబుల్‌ స్పూన్‌
  • నూనె - 3 టేబుల్‌ స్పూన్లు

జామకాయలను నేరుగా తినడమే కాదు - ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్​ వేరే లెవల్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా జామకాయలను శుభ్రంగా కడిగి, పీల్ చేసి నిలువుగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కట్ చేసిన జామ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, శనగపిండి, పెరుగు వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, టమాటలను తరిగి పక్కన పెట్టుకోవాలి. అనంతరం వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి లో ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకోవాలి.
  • అవి వేగాక అందులో ఉల్లిపాయ తరుగు వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా మిశ్రమం యాడ్ చేసుకొని మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న జామకాయ ముక్కలు, కొద్దిగా వాటర్, మెంతి ఆకుల పొడి, ఎండుకొబ్బరి తురుము వేసి అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలియబెట్టాలి.
  • ఆపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్‌ వచ్చే వరకు ఉడికించి దింపేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్​లోని ప్రెషర్​ మొత్తం పోయాక మూత తీసి నెమ్మదిగా ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే "జామకాయ మసాలా" మీ ముందు ఉంటుంది!

బ్యాచిలర్స్​ స్పెషల్​ సూపర్​ టేస్టీ "మసాలా ఎగ్ బిర్యానీ" - ఇలా ప్రిపేర్ చేస్తే జిందగీ ఖుష్​ అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.