Champions Trophy Rohti Sharma ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌కు టీమ్ఇండియా సిద్ధం అవుతోంది. టోర్నీలో పాల్గొనేందుకు భారత్ క్రికెట్ జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకుంది. ఇప్పటికే ఆటగాళ్లంతా నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ టీమ్ఇండియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈసారి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. అలాగే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని క్లార్క్ వ్యాఖ్యానించాడు. రోహిత్ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి వల్లా కాదని అన్నాడు. రీసెంట్గా ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకోవడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశమని స్పష్టం చేశాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారతే గెలుచుకుంటుందని చెబుతున్నా. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్‌లోకి రావడం బాగుంది. అందుకే టీమ్‌ఇండియా టైటిల్ దక్కించుకోగలదని భావిస్తున్నా. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్‌గానూ నిలుస్తాడు. ఇక జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అవుతాడనుకుంటున్నా. జట్టు పరంగా ఇంగ్లాండ్‌కు టైటిల్ అవకాశాలు తక్కువే. కానీ, ఆ జట్టులో జోఫ్రానే సూపర్ స్టార్. ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలుస్తాడని అనుకుంటున్నా. హెడ్ ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. గత వన్డే వరల్డ్‌కప్‌లోనూ అతడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు' అని క్లార్క్ పేర్కొన్నాడు.
ODI CENTURY number 3⃣2⃣ in 📸📸
— BCCI (@BCCI) February 9, 2025
Describe Captain Rohit Sharma's Cuttack 💯 in one word ✍️
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/5mu59OBCTu
గేల్ రికార్డ్‌పై విరాట్ కన్ను!
ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ ముంగిట ఓ రికార్డు ఉంది. విరాట్ మరో 263 పరుగులు చేస్తే, ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ప్లేయర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో గేల్ 791 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. విరాట్ 13 మ్యాచ్‌ల్లో 529 పరుగులు చేశాడు. జాబితాలో శిఖర్ ధావన్ (701 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.
టీమ్ఇండియాకే కాదు, భారత జెండాకే వణికిపోతున్న పాకిస్థాన్- మరీ ఇంత భయమా!
8ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ- ఫేవరెట్‌గా భారత్- ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే?