iPhone 16e : ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న టెక్ బ్రాండ్ యాపిల్. ఈ యాపిల్ సంస్థ అందించే ఐఫోన్‌కు వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది. ఐఫోన్లకు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పుడెప్పుడు ఐఫోన్ కొత్త సిరీస్‌లు వస్తాయానని ఎంతో మంది ఎదురు చూస్తారు. ధర ఎక్కువైనా సేఫ్టీ గురించి, హోదా కోసం ఆలోచించి చాలా మంది యాపిల్ ఐఫోన్లలను కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఏటా మార్కెట్‌లోకి న్యూ ఐఫోన్ సిరీస్ ఫోన్లను యాపిల్ సంస్థ తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 16ఈ(iPhone 16e)ని భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
మరోవైపు తన అధికారిక స్టోర్ నుంచి ఐఫోన్ ఎస్‌ఈని తీసేసింది.. మొదట ఐఫోన్ ఎస్‌ఈ 4ను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ కొత్త మోడల్‌తో ఐఫోన్ 16 సిరీస్‌ను ఎక్స్‌పాండ్ చేసింది. మరింత మంది యూజర్లకు చేరువయ్యే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ ఐఫోన్ 16ఈ సిరీస్ ఫోన్ల ధరలు, ఫీచర్లపై ఓ లుక్కేసేయండి మరీ.
ఐఫోన్ 16ఈ సిరీస్ ఫీచర్లు : ఐఫోన్ 16ఈ సిరీస్ ఫోన్లలో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్‌తో తీసుకొచ్చారు. 60Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. ఈ కొత్త సిరీస్ ఫోన్లకు యాక్షన్ బటన్ కూడా ఇచ్చారు. ఏ18 చిప్‌ను దీనిలో అమర్చారు. ఐఫోన్ 16ఈ మోడల్‌కు ఏఐ ఫీచర్లు సైతం సపోర్ట్ చేయనున్నాయి. సెల్ఫీ కోసం ముందు వైపు కెమెరా 12 ఎంపీ, వెనకవైపు 48 ఎంపీ కెమెరాను ఇచ్చారు. 18 వాట్స్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేయనుంది. వైర్లెస్ ఛార్జింగ్ సైతం ఉంటుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండగా, ఐఓఎస్ 18పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఫేస్ రికగ్నైషన్ ఫీచర్ సైతం ఉంది. యూఎస్బీ టైప్ సీ పోర్టుకు సపోర్టు చేస్తుంది.
ఐఫోన్ 16ఈ సిరీస్ ధర : ఈ కొత్త మోడల్ ఐఫోన్లలో మూడు వేరియంట్లు ఇచ్చారు.
- బేస్ మోడల్ : ధర రూ.59,900 (128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ)
- రెండో వేరియంట్ : ధర రూ.69,900(256 జీబీ)
- మూడో వేరియంట్ : ధర రూ.89,900(512 జీబీ)
- రంగు : తెలుపు, నలుపు
NOTE : ఫిబ్రవరి 21 నుంచి ముందస్తు ఆర్డర్‌లు తీసుకోనున్నారు. ఆ తర్వాత 28 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.
గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు - కారణం అదే! - IPhone Prices Slashed